గుంటూరులో గుర్తుతెలియని యువకులు ఓ వాచ్మెన్పై దాడి చేసి పరారయ్యారు. సంపత్‌నగర్‌లోని అయ్యప్పస్వామి దేవస్థానం పక్కన ఉన్న ఖాళీ స్థలానికి జగదీష్ అనే వ్యక్తి వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. ఆలయానికి సమీపంలో రెండు ప్రేమ జంటలు అసభ్యకార్యకలాపాలు సాగిస్తుండగా ఆయన గమనించాడు. అక్కడి నుంచి వెళ్లిపోవాలని తెలిపాడు. అందుకు కోపంతో ఊగిపోయిన యువకులు వాచ్మెన్పై కర్రతో దాడిచేశారు. అనంతరం అక్కడ నుంచి యువతి, యువకులు ద్విచక్ర వాహనాలపై పరారయ్యారు. గాయపడిన జగదీష్‌ను స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న లాలాపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
దేవస్థానం పక్కన అసభ్యకార్యకలాపాలు.. అడ్డుచెప్పిన వాచ్మెన్పై దాడి - ప్రేమ జంటలు ఆలయం సమీపంలో అసభ్యకరం
గుంటూరులో రెండు ప్రేమ జంటలు స్థానిక ఓ ఆలయం సమీపంలో అసభ్యకరంగా ప్రవర్తించారు. వారిని వాచ్మెన్ అక్కడి నుంచి వెళ్లిపొమ్మని కోరాడు. అందుకు కోపంతో ఊగిపోయిన ఆ యువకులు అతనిపై కర్రతో దాడిచేశారు.
![దేవస్థానం పక్కన అసభ్యకార్యకలాపాలు.. అడ్డుచెప్పిన వాచ్మెన్పై దాడి two love couples attack on watchman](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9166807-119-9166807-1602612420927.jpg)
వాచ్మెన్పై దాడి