ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న రెండు లారీలు సీజ్ - చేబ్రోలు రేషన్ బియ్యం పట్టివేత న్యూస్

అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న రెండు లారీలను పోలీసులు సీజ్ చేశారు. ఈ ఘటన గుంటూరు జిల్లా చేబ్రోలులో జరిగింది.

pds rice seize
రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న రెండు లారీలు సీజ్

By

Published : Sep 10, 2020, 9:32 AM IST

గుంటూరు జిల్లా పొన్నూరు మండలం చింతలపూడి గ్రామం నుంచి కాకినాడకు.. రెండు లారీల్లో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు సీజ్ చేశారు. చేబ్రోలు వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా... లారీల్లో బియ్యాన్ని తరలించటాన్ని పోలీసులు గుర్తించారు. బియ్యానికి సంబంధించిన సరైన పత్రాలు లేకపోవటంతో.. పోలీసులు సివిల్ సప్లై అధికారులకు సమాచాం అధించారు. బియ్యాన్ని పరిశీలించిన సివిల్ సప్లై తహసీల్దార్ ఓంకార్ అవి రేషన్ బియ్యమేనని నిర్థరించారు. దీంతో చేబ్రోలు పోలీసులు లారీల్లో ఉన్న 1000 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకొని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details