ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Minister Gautam Reddy: 'రాష్ట్రంలో 2 లాజిస్టిక్‌ పార్కులు ఏర్పాటు చేస్తాం'

లాజిస్టిక్‌ పాలసీ-2021ని త్వరలో ప్రకటిస్తామని.. రెండు ప్రాంతాల్లో ప్రస్తుతం లాజిస్టిక్ పార్కులు ఏర్పాటు చేస్తామని మంత్రి గౌతమ్ రెడ్డి తెలిపారు. కేంద్ర స్థాయి అథారిటీ ఏర్పాటులో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఛైర్మన్‌గా లాజిస్టిక్స్‌ సమన్వయ కమిటీ ఏర్పాటు చేశామని వెలగపూడిలో అన్నారు.

two logistics parks in ap
మంత్రి గౌతమ్ రెడ్డి

By

Published : Jul 28, 2021, 9:32 AM IST

నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం, తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ పోర్టుల సమీపంలోని ఏపీఐఐసీ భూముల్లో పీపీపీ విధానంలో రెండు మల్టీ మోడల్‌ లాజిస్టిక్‌ పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి గౌతమ్‌రెడ్డి ప్రకటించారు. వీటికోసం ఒక్కోచోట 100 ఎకరాలను కేటాయిస్తామన్నారు. వెలగపూడి సచివాలయంలోని సమావేశ మందిరంలో పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పనపై నిర్వహించిన సమీక్షలో ఆయన తెలిపారు.

‘లాజిస్టిక్‌ పాలసీ-2021ని త్వరలో ప్రకటిస్తాం. రాష్ట్రంలోని మేజర్‌, మైనర్‌ పోర్టులు, కోల్డ్‌ స్టోరేజీలు, గోదాములు, సరకు రవాణా వాహనాల నిర్వహణ విధివిధానాలను అందులో పేర్కొంటాం. మైనర్‌ పోర్టుల్లో 2020లో ఉన్న 50% సరకు రవాణాను 2026 నాటికి 70 శాతానికి పెంచేలా ప్రణాళికలు రూపొందిస్తాం. రాష్ట్ర, జాతీయ రహదారులకు సమీపంలో సరకు రవాణా వాహనాల కోసం ట్రక్‌ పార్కింగ్‌ బేలను నిర్మిస్తాం. కేంద్ర స్థాయి అథారిటీ ఏర్పాటులో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఛైర్మన్‌గా లాజిస్టిక్స్‌ సమన్వయ కమిటీ ఏర్పాటు చేశాం’ -మంత్రి గౌతమ్‌రెడ్డి

విశాఖలో ప్రతిపాదించిన రెండు ఐటీ ఐకానిక్‌ టవర్ల నిర్మాణం, పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌లు, ఎలక్ట్రిక్‌ వాహనాలకు సంబంధించి పరిశ్రమలతో జరిగిన పురోగతిపై చర్చించారు.

ఇదీ చూడండి:

Sreesailam: శ్రీశైలానికి 4 లక్షల క్యూసెక్కులకు పైగా వరద.. నేడు గేట్లు ఎత్తనున్న అధికారులు

ABOUT THE AUTHOR

...view details