ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వాహనాల తనిఖీలో రెండు కిలోల పొడి గంజాయి స్వాధీనం

గుంటూరు జిల్లా వినుకొండలో అక్రమంగా తరలిస్తున్న రెండు కిలోల పొడి గంజాయిని ఎస్​ఈబీ పోలీసులు పట్టుకున్నారు. గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎవరైనా గంజాయి తరలింపునకు పాల్పడితే కఠిన చర్యలుంటాయని ఎస్​ఈబీ ఇన్​స్పెక్టర్​ కె. శ్రీనివాస్ హెచ్చరించారు.

two kilograms ganja seized
రెండు కిలోల పొడి గంజాయి స్వాధీనం

By

Published : Mar 27, 2021, 7:46 PM IST

గుంటూరు జిల్లా వినుకొండ పట్టణం సమీపంలోని కారంపూడి రోడ్​లో వాహనాల తనిఖీ సందర్భంగా రెండు కిలోల పొడి గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. వినుకొండ స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్​ బ్యూరో ఇన్​స్పెక్టర్​ కె. శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిషేధిత గంజాయి అక్రమ రవాణాపై వాహన తనిఖీలు చేపట్టారు. ఈపూరు మండలం కొచెర్ల గ్రామానికి చెందిన ఒంటిపులి వెంకట కోటయ్య గంజాయి తరలిస్తుండగా గుర్తించారు. గంజాయిని స్వాధీనం చేసుకుని.. నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు.

వినుకొండ పట్టణంలో కొంతమంది యువత గంజాయికి బానిసలు అవుతున్నట్లు సమాచారం ఉందని ఎస్​ఈబీ ఇన్​స్పెక్టర్​ కె. శ్రీనివాస్ అన్నారు. ఇప్పటికే వినుకొండ ఎస్​ఈబీ స్టేషన్ పరిధిలో నలుగురిపై గంజాయి కేసులు పెట్టినట్లు ఆయన తెలిపారు. అధికారుల ఆదేశాల మేరకు త్వరలోనే పలు కళాశాలలు, పాఠశాల్లలో గంజాయి వల్ల జరిగే అనర్ధాలపై అవగాహన సదస్సులు, ర్యాలీలు చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details