బాయిలర్ పేలి చికిత్స పొందుతున్న ఐదుగురిలో ఇద్దరు మృతి - గుంటూరులో బాయిలర్ పేలిన ఘటన
గుంటూరు జిల్లా ఈపూరు వద్ద బాయిలర్ పేలిన ఘటనలో.. చికిత్స పొందుతున్న ఐదుగురిలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ ప్రమాదం ఆరు రోజుల క్రితం సంభవించింది.
బాయిలర్ పేలి చికిత్స పొందుతున్న ఐదుగురిలో ఇద్దరు మృతి
ఆరు రోజుల క్రితం.. గుంటూరు జిల్లా ఈపూరు వద్ద బాయిలర్ పేలిన ఘటనలో ఐదుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న వీరిలో ఇద్దరు మరణించారు. మృతులు ఫణిభూషణ్, రాజేష్‌గా వైద్యులు వెల్లడించారు. దీంతో బాధిత కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. మిగిలినవారి పరిస్థితీ.. విషమంగానే ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు.