గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం గణపవరంలో మద్యం తాగిన వ్యక్తి వాహనంపై వెళ్తూ.. ఐస్‌క్రీం బండిని ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన యువకుడు గోపి.. ఐస్‌క్రీం అమ్ముకుంటూ చిలకలూరిపేట పట్టణంలోని పోలిరెడ్డిపాలెంలో నివాసం ఉంటున్నాడు. ఐస్‌క్రీం బండితో వేలూరు నుంచి గణపవరం ప్రయాణిస్తున్నాడు. పెదనందిపాడు మండలం అన్నపర్రుకి చెందిన డేనియలు.. మద్యం తాగి ద్విచక్ర వాహనంపై వేలూరు వైపు వెళుతున్నాడు.
వాహనం అదుపుతప్పి ఐస్‌క్రీం బండిని డేనియలు ఢీకొన్నాడు. ఈ ఘటనలో.. అతనితో పాటు.. ఐస్ క్రీం బండిపై ఉన్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. వారిద్దరికీ చిలకలూరిపేట 108 సిబ్బంది సకాలంలో ప్రథమ చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పింది. వీరిని తొలుత చిలకలూరిపేట ప్రభుత్వ వైద్యశాలలో చేర్పించారు. వైద్యుల సిఫార్సుతో మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై తమకెలాంటి ఫిర్యాదు అందలేదని నాదెండ్ల పోలీసులు తెలిపారు.