ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మద్యం వద్దన్నందుకు కర్రలలో దాడి - yalavarthipaadu news

గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం యాలపర్తిపాడులో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఆరుగురు గాయపడ్డారు. ఎస్సీ కాలనీలో దినకర్మ కార్యక్రమం జరుగుతున్న చోట ఓ వర్గం వారు మద్యం తాగడం పట్ల కొందరు అభ్యంతరం తెలిపారు. ఇరు వర్గాల మధ్య మాటా మాటా పెరిగి కర్రలతో దాడికి దిగారు.

మద్యం తాగ వద్దన్నందుకు కర్రలతో దాడి.. రెండు వర్గాలు ఢీ
మద్యం తాగ వద్దన్నందుకు కర్రలతో దాడి.. రెండు వర్గాలు ఢీ

By

Published : Oct 28, 2020, 4:26 AM IST

గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం యలవర్తిపాడులో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. యలవర్తిపాడు ఎస్సీ కాలనీలో దినకర్మ జరుగుతుండగా ఓ వర్గం వారు మద్యం తాగ్గుతున్నారు. ఇక్కడ మందు తాగవద్దని మరో వర్గం వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మాటా మాటా పెరిగింది. ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు.

పోలీసులకు సమాచారం..

సమాచారం అందుకున్న మేడికొండూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులను గమనించిన రెండు వర్గాలు అక్కడ నుంచి పరారయ్యాయి. దాడిలో ఇరు వర్గాలకు చెందిన ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి.

సీఐ విచారణ..

సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ ఆనందరావు విచారణ చేపట్టారు. గ్రామంలో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పొలీసులు పహారా కాస్తున్నారు.

ఇవీ చూడండి : ప్రొద్దుటూరులో విజిలెన్స్​ అధికారుల తనిఖీలు

ABOUT THE AUTHOR

...view details