గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు కొవిడ్ చికిత్స పొందుతూ మరణించారు. మృతి చెందిన వారిలో మైనర్ ఇరిగేషన్ ఎఈ గుమ్మా ప్రసాద్ (45), చిలకలూరిపేట ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న కాలే షావలి (47) ఉన్నారు.
మండలంలో మైనర్ ఇరిగేషన్ ఏఈగా పనిచేసి.. రాజాపేట ప్రత్యేక అధికారిగా ఉన్న గుమ్మా ప్రసాద్.. గుంటూరు ఛానల్ ఏఈగా పనిచేశారు. కాలే షావలి స్వగ్రామం యడ్లపాడు కాగా.. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.