గుంటూరులో అంఫోటెరిసిన్-బి అక్రమ విక్రయాలపై ఔషధ నియంత్రణశాఖ అధికారులు దాడి చేశారు. ఒక్కో వయల్‌ను రూ.60వేలకు అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు. ఇంజెక్షన్లు అమ్ముతున్న రెండు ముఠాలను పట్టుకుని, ఔషధ దుకాణం నిర్వాహకుడు మహేష్, ఓ ఆస్పత్రి పీఆర్వో లింగమూర్తి, వైద్యులుగా చెలామణి అవుతున్న షేక్ సైదా, ప్రవీణ్ కుమార్‌లనూ అరెస్టు చేశారు. నిందితుల నుంచి 21 అంఫోటెరిసిన్-బి వయల్స్ స్వాధీనం చేసుకున్నారు.
ఔషధాల అక్రమ విక్రయానికి పాల్పడుతున్న రెండు ముఠాలు అరెస్టు - guntur latest news
గుంటూరులో ఔషధ నియంత్రణశాఖ అధికారులు దాడులు చేశారు. అంఫోటెరిసిన్-బి అక్రమ విక్రయానికి పాల్పడుతున్న రెండు ముఠాలను పట్టుకున్నారు.
గుంటూరులో ఔషధ నియంత్రణశాఖ అధికారులు దాడులు