గుంటూరు జిల్లాలో ఓ ప్రేమ పెళ్లి వ్యవహారం రెండు కుటుంబాల మధ్య ఘర్షణకు దారి తీసింది. సత్తెనపల్లి మండలం కట్టావారి పాలెంకు చెందిన యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. సామాజిక వర్గాలు వేరు కావటంతో పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. ఈ క్రమంలో వారు పారిపోయి పెళ్లి చేసుకున్నారు. కొద్ది రోజుల క్రితం ఇంటికి వచ్చారు. పట్టింపులకు పోయిన ఇరు కుటుంబాల వారు కర్రలతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఇందులో 11 మందికి గాయాలయ్యాయి. వీరిని సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రేమ పెళ్లి.. రెండు కుటుంబాల మధ్య చిచ్చు - latest news on love marriages in guntur
గుంటూరు జిల్లా సత్తెనప్లలి మండలం కట్టావారి పాలెంలో ఓ ప్రేమ వివాహం రెండు కుటుంబాల మధ్య చిచ్చు పెట్టింది. పెద్దలు ఒప్పుకోకపోవటంతో.. యువతీ యువకులు పారిపోయి వివాహం చేసుకున్నారు. కొన్ని రోజులు తర్వాత వారు తిరిగి వచ్చారు. పట్టింపులకు పోయి రెండు కుటుంబాల వారు ఘర్షణకు దిగారు.
![ప్రేమ పెళ్లి.. రెండు కుటుంబాల మధ్య చిచ్చు two families fought due to love marriage at guntur](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6616197-275-6616197-1585717792043.jpg)
గుంటూరులో ప్రేమ వివాహం చిచ్చు