గుంటూరు జిల్లా వినుకొండ శావల్యాపురంలో పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో పెద్ద ఎత్తున మద్యం స్వాధీనం చేసుకున్నారు. గోవా నుంచి అక్రమంగా తరలిస్తున్న 4020 మద్యం సీసాలు పట్టుకొని, ఇద్దరు డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఎస్పీ విశాల్ గున్నీ ఆదేశాల మేరకు ఎస్ఐ శివ నాగరాజు, పోలీసుల బృందం ఈ తనిఖీలు చేసింది. వాహనాన్ని, డ్రైవర్లను గుంటూరు తరలించినట్లు వెల్లడించారు.
గోవా నుంచి అక్రమంగా మద్యం రవాణా.. పోలీసులకు చిక్కిన డ్రైవర్లు - గుంటూరు జిల్లా వినుకొండలో పోలీసులు తనిఖీలు తాజా వార్తలు
వినుకొండలో చేపట్టిన తనిఖీల్లో పోలీసులు పెద్ద ఎత్తున మద్యం స్వాధీనం చేసుకున్నారు. గోవా నుంచి వాహనంలో మద్యం తీసుకొస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు.
గోవా నుంచి అక్రమంగా మద్యం రవాణా
Last Updated : Nov 17, 2020, 3:25 PM IST