ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కారును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు... ఇద్దరు మృతి - two died in road accident news

గుంటూరు జిల్లా తుమ్మపూడి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. కారును ఆర్టీసీ బస్సు ఢీకొట్టటంతో ప్రమాదం జరిగింది.

road accident
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

By

Published : May 4, 2021, 11:28 AM IST

గుంటూరు జిల్లా తెనాలి - మంగళగిరి ప్రధాన మార్గం తుమ్మపూడి వద్ద.. కారును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.

దుగ్గిరాల మండలానికి చెందిన వీరమాచినేని సునీల్ రాయ్, అతడి స్నేహితుడు రవి తెనాలిలో వ్యాపారం చేస్తున్నారు. వీరు కారులో విజయవాడకు వెళ్తుండగా.. అదే మార్గంలో వస్తున్న ఆర్టీసీ బస్సును అధిగమించటానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించేందుకు.. ఆర్టీసీ బస్సు పక్కగా రావటంతో.. బస్సు కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జవటంతో.. స్నేహితులిద్దరూ ఇరుక్కుపోయారు.

ఆ మార్గంలో వెళ్తున్న స్థానికులు.. కారును పగులగొట్టి ఇద్దర్నీ బయటకు తీయగా.. అప్పటికే వారిద్దరూ మృతి చెందినట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న ఎస్సై ప్రతాప్ ఘటనా స్థాలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై వివరించారు.

ఇదీ చదవండి:రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి...

ABOUT THE AUTHOR

...view details