ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పీడీఎస్​ బియ్యం అక్రమ రవాణాలో నిందితుల అరెస్ట్

రెండు రోజుల క్రితం గంటూరు జిల్లా పెదకాకాని మండలం అనుమర్లపూడిలో.. పోలీసులు 400 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ కేసుకు సంబంధించి.. కొందరు నిందితులను అరెస్ట్ చేసినట్లు అర్బన్ ఎస్పీ అమ్మి రెడ్డి వెల్లడించారు. మరికొంత మందిని త్వరలోనే పట్టుకుంటామన్నారు.

pds rice accused arrest
పీడీఎస్ బియ్యం రవాణా నిందితుల అరెస్ట్

By

Published : Nov 7, 2020, 9:58 PM IST

పెదకాకాని మండలం అనుమర్లపూడిలో 2 రోజుల క్రితం 400 బస్తాల రేషన్ బియ్యం పట్టుకోగా.. సంబంధిత వ్యక్తులను అరెస్టు చేసినట్లు గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మి రెడ్డి తెలిపారు. పీడీఎస్ సరకు అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

తెనాలికి చెందిన అశోక్ అనే వ్యక్తి.. జంపని పెదవడ్లపూడిలో రేషన్ డీలర్ల వద్ద బియ్యం బస్తాలను కొనుగోలు చేశాడు. అనుమర్లపూడిలోని విస్తారం రామకోటయ్య దగ్గర నిల్వ చేశాడు. కోటేశ్వరావు అనే వ్యక్తి సహకారంతో అక్కడ నుంచి తరలించడానికి ప్రయత్నించారు. తూర్పు గోదావరి జిల్లా అలంగుడిలోని విజయలక్ష్మి రైస్ మిల్​కు పంపిస్తుండగా అశోక్​తో పాటు లారీ డ్రైవర్ సన్ షేర్ ఖాన్​ను అరెస్ట్ చేశామని ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. రైస్ మిల్లు యజమాని, బ్రోకర్​, డీలర్లను అదుపులోకి తీసుకోవాల్సి ఉందన్నారు.

ఇదీ చదవండి:ఫోన్ కాల్ ఆరోపణలపై స్పందించిన ఎమ్మెల్యే శ్రీదేవి.. ఏమన్నారంటే..?

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details