ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పల్లెలకు విస్తరిస్తున్న కరోనా మహమ్మారి

లాక్ డౌన్ అమలు చేసిన 72 రోజుల తరువాత కొత్తగా గ్రామీణ ప్రాంతాలకు కరోనా విస్తరించడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్ర హోంమంత్రి సుచరిత ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రత్తిపాడు నియోజకవర్గంలో తొలిసారి 2 కరోనా కేసులు నమోదు అయ్యాయి.

two corona positive cases
పల్లెలకు విస్తరిస్తున్న కరోనా మహమ్మారి

By

Published : Jun 4, 2020, 1:30 AM IST

గుంటూరు జిల్లాలో కరోనా కేసులు తగ్గినట్లే తగ్గి.. మళ్లీ వాటి ఉనికిని చాటుకుంటున్నాయి. 72 రోజులుగా ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో తాజాగా కరోనా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ప్రత్తిపాడు నియోజకవర్గంలోని 4 మండలాల్లో ఇప్పటివరకు కరోనా కేసులు నమోదు కాలేదు. తొలిసారిగా 2 కరోనా పాజిటివ్ కేసులు రావడం ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. ప్రత్తిపాడులోని రామ్ నగర్ కాలనీకి చెందిన 52 ఏళ్ల వ్యక్తికి కరోనా సోకింది. ఇతను గుంటూరులోని కూరగాయల మార్కెట్​లో ముఠా కూలీ.

ఇటీవల మార్కెట్​లో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా.. అధికారులు అక్కడ పనిచేసే 190 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అందులో ప్రత్తిపాడుకు చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్​గా తేలింది. వట్టిచెరుకూరు మండలం పల్లపాడులో మరొకరికి కరోనా సోకినట్లు అధికారులు నిర్ధరించారు. వీరితో సంబంధం ఉన్న వారిని అంబులెన్స్​లో ఐసోలేషన్​కు తరలించారు. సౌత్ జోన్ డీఎస్పీ కమలకరరావు కాలనీలోని పరిస్థితిని పరిశీలించారు. ఈ ప్రాంతాలకు రాకపోకలు నిలుపుదల చేయాలని ఆదేశించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details