గుంటూరు జిల్లా నరసరావుపేట మండలానికి చెందిన ఇద్దరు విద్యార్థినుల అదృశ్యం అయ్యారు. కళాశాలకు వెళ్తున్నామని చెప్పి తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసినట్లు నరసరావుపేట గ్రామీణ ఎస్సై పేర్కొన్నారు.
నరసరావుపేటలో ఇద్దరు కళాశాల విద్యార్థినుల అదృశ్యం - ఇద్దరు కళాశాల విద్యార్థినుల అదృశ్యం న్యూస్
గుంటూరు జిల్లా నరసరావుపేట మండలానికి చెందిన ఇద్దరు విద్యార్థినుల అదృశ్యం.. తీవ్ర కలకలం సృష్టించింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసుగా నమోదు చేసినట్లు నరసరావుపేట గ్రామీణ ఎస్సై పేర్కొన్నారు.
నరసరావుపేటలో ఇద్దరు కళాశాల విద్యార్థినుల అదృశ్యం
రావిపాడు గ్రామానికి చెందిన బందెల నారమ్మ (20), నరసరావుపేటకు చెందిన అనితలు పట్టణంలోని ఎస్ఎస్ఎన్ కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నారు. ఈ నెల 18న కళాశాలకు వెళ్తున్నామని ఇంటి నుంచి వెళ్లారు. అప్పటి నుంచి ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసుగా నమోదు చేసినట్లు నరసరావుపేట గ్రామీణ ఎస్సై పేర్కొన్నారు. విద్యార్థినుల ఆచూకి తెలిసిన వారు సమాచారం ఇవ్వాలని కోరారు.