ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇద్దరు చిన్నారుల హత్య కేసు.. నిందితుడు అరెస్ట్ - Two children killed Defendant arrested

గుంటూరు జిల్లా రేపల్లెలో సంచలం సృష్టించిన ఇద్దరు చిన్నారుల హత్యకేసు నిందితుడిని పోలీసులు ఆరెస్టు చేశారు. బాబాయి కాటూరి శ్రీనివాసరావు.. వాళ్ల తలపై కొట్టి హత్య చేసినట్లు బాపట్ల డీఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు.

two child murder case Defendant arrested
ఇద్దరూ చిన్నారుల హత్య కేసులో నిందితుడు అరెస్టు

By

Published : Jun 30, 2021, 10:49 PM IST

గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలో అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారుల హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేసినట్లు బాపట్ల డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. పిల్లల బాబాయి కాటూరి శ్రీనివాసరావు.. తన ఇంటిలో చెక్కతో పిల్లల తలపై కొట్టి హత్య చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు. ముద్దాయి మతిస్థిమితం సరిగానే ఉందని.. కోర్టులో హాజరు పరచనున్నట్లు తెలిపారు.

బెంగళూరు టూ రేపల్లె..

కొండేటి కోటేశ్వరరావు, ఉమాదేవి దంపతులకు ఇద్దరు కుమారులు.. పార్ధీవ్ సహస్వత్ (10), రోహన్ తరస్విన్(8). బెంగళూరులో సాఫ్ట్​వేర్​ ఉద్యోగం చేస్తూ అక్కడే నివాసముంటున్న కోటేశ్వరరావు..లాక్​డౌన్ కారణంగా పిల్లలతో రేపల్లెలోని అత్తగారి ఇంటికి వచ్చి 4 నెలలుగా అక్కడే ఉంటున్నారు.

కోటేశ్వరరావు తోడళ్లుడు శ్రీనివాసరావు.. ఉద్యోగం లేకపోవడంతో కొద్దీ నెలలుగా ఫ్యామిలీతో కలిసి అత్తగారింటి సమీపంలో మరో ఇంటిలో అద్దెకు ఉంటున్నారు. అయితే పార్ధీవ్, రోహన్.. ఆడుకుంటుండగా శ్రీనివాసరావు.. వాళ్లను తను ఇంటిలోకి తీసుకెళ్లాడు. అక్కడే చెక్కలతో పిల్లల తలపై కొట్టాడు.

అప్పటికే చనిపోయారు.

ఆ సమయంలో అక్కడే ఉన్న శ్రీనివాసరావు పిల్లలు.. విషయం కుటుంభ్యులకు చెప్పడంతో వెంటనే చిన్నారులను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ముద్దాయి శ్రీనివాసరావును అరెస్టు చేశారు. నిందితుని స్వగ్రామం కర్లపాలెం గ్రామం. కొద్దీ నెలలుగా అత్తగారి ఇంటి సమీపంలో అద్దెకు ఉంటున్నాడు.

అసూయతో హత్య

కొండేటి కోటేశ్వరరావు వచ్చినప్పటీ నుంచి అత్తగారింట్లో తనను చిన్నచూపు చూస్తున్నారన్నారని శ్రీనివాసరావు అసూయతో ఊగిపోయాడు. ఈ క్రమంలో దీంతో కోపం పెంచుకున్న అతను.. ఆడుకుంటున్న వదిన పిల్లలను ఇంట్లోకి తీసుకెళ్లి చెక్కతో కొట్టి హత్య చేశాడని డీఎస్పీ తెలిపారు.

సంబంధిత కథనం..

గుంటూరు జిల్లాలో దారుణం..ఇద్దరు చిన్నారుల హత్య!

ABOUT THE AUTHOR

...view details