ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చిలకలూరిపేటలో రెండు కరోనా కేసులు నమోదు - గుంటూరు జిల్లా తాజా కరోనా వార్తలు

చిలకలూరిపేటలో శనివారం రెండు కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. కరోనా వచ్చి కోలుకున్న ఓ మహిళ గుండె పోటుతో మృతి చెందింది. ఆ ప్రాంతాలను కంటైన్మెంట్​ జోన్​గా అధికారులు ప్రకటించారు.

two cases found in chilakalurpeta and a lady died of heart attack
చిలకలూరిపేటలో అప్రమత్తమైన అధికారులు

By

Published : Jul 5, 2020, 2:40 PM IST

గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో శనివారం మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. హైదరాబాద్ నుంచి వచ్చిన వ్యక్తి నుంచి అతని కుమారుడికి పాజిటివ్ వచ్చింది. వీరిద్దరిని కొవిడ్​ కేర్​ సెంటర్​కు తరలించారు. ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్​ జోన్​గా అధికారులు ప్రకటించారు. పారిశుద్ధ్య చర్యలు ముమ్మరం చేశారు. దీంతో పాటు పట్టణంలోని చిన్న పీరు సాహెబ్ వీధికి చెందిన ఒక మహిళకు గతంలో పాజిటివ్ వచ్చింది.

కరోనా వచ్చిన మహిళ గుండెపోటుతో మృతి

పట్టణంలోని చిన్న పీరు సాహెబ్ వీధికి చెందిన ఒక మహిళకు గతంలో కరోనా పాజిటివ్ వచ్చింది. ఆమెకు ఐసోలేషన్​లో చికిత్స నిర్వహించారు. 28 రోజుల అనంతరం తిరిగి ఇంటికి వచ్చి ఉంటుంది. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం సదరు మహిళకు గుండెపోటు వచ్చింది. ఆసుపత్రికి తీసుకెళ్ళే లోపే మృతి చెందింది. తన తల్లికి గతంలో కరోనా పాజిటవ్​ వచ్చిన విషయం తెలుసుకుని వాహనంలో ఎక్కించేందుకు ఎవ్వరూ సహకరించలేదని మృతురాలి కుమారుడు వాపోయాడు. ఒక్కరైనా కనీస మానవత్వం చూపించి ఉంటే తన తల్లికి ఈ పరిస్థితి వచ్చేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి :

సంతకవిటిలో కరోనా విజృంభణ... ఒక్క రోజే 20 కేసులు నమోదు

ABOUT THE AUTHOR

...view details