గుంటూరు జిల్లా తెనాలి నుంచి గుంటూరుకు వెళ్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు వచ్చాయి. అంగలకుదురు - సంగం జాగర్లమూడి మధ్య ఈ ప్రమాదం జరిగింది. వెంటనే కారు డ్రైవర్ అప్రమత్తమై వాహనాన్ని నిలిపి వేశాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపులోకి తెచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు భావిస్తున్నారు.
తెనాలి : నిమిషాల వ్యవధిలోనే రెండు కార్లు దగ్ధం - guntur district latest news
గుంటూరు జిల్లా తెనాలిలో నిమిషాల వ్యవధిలోనే రెండు కార్లలో నుంచి మంటలు రావడం కలకలం రేపింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అయినప్పటికీ.. కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.
![తెనాలి : నిమిషాల వ్యవధిలోనే రెండు కార్లు దగ్ధం two cars burn at fire accident in tenali guntur district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9800077-1053-9800077-1607364767448.jpg)
తెనాలిలో నిమిషాల వ్యవధిలోనే రెండు కార్లు దగ్ధం
తెనాలిలో నిమిషాల వ్యవధిలోనే రెండు కార్లు దగ్ధం
మరో ఘటనలో తెనాలి చెంచుపేటకు చెందిన విజయకుమార్ కారుకు మరమ్మతులు చేస్తుండగా... బ్యాటరీ నుంచి పొగలు వచ్చాయి. క్షణాల్లోనే మంటలు వ్యాపించి కారు పూర్తిగా దగ్ధమైంది.
ఇదీచదవండి.