ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంటూరులో రెండు అనుమానిత కరోనా కేసులు - గుంటూరులో రెండు అనుమానిత కరోనా కేసులు

కరోనా లక్షణాలతో ఇద్దరు వ్యక్తులు గుంటూరు ఆసుపత్రిలో చేరారు. వీరికి ఐసోలేషన్​ వార్డులో ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. కరోనా వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించేందుకు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నామని ఆసుపత్రి ఆరోఎంవో సునంద తెలిపారు.

two carona suspect cases in guntur district
గుంటూరులో రెండు అనుమానిత కరోనా కేసులు

By

Published : Mar 16, 2020, 1:34 PM IST

గుంటూరులో రెండు అనుమానిత కరోనా కేసులు

గుంటూరు జిల్లాలో కరోనా అనుమానిత లక్షణాలతో ఇద్దరు రోగులు ఆసుపత్రిలో చేరారు. నగర శివార్లలోని ఐడీ ఆసుపత్రిలో వారిని ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఒక మహిళ నేపాల్​కు తీర్థయాత్రలకు వెళ్లిరాగా... మరో యువతి... నాగార్జున విశ్వవిద్యాలయంలో చదువుతోంది. ఆమె స్వదేశం చైనాకు ఇటీవలే వెళ్లివచ్చింది. వీరిద్దరి నుంచి నమూనాలు సేకరించి తిరుపతి పంపించారు. ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు ఆసుపత్రి ఆరోఎంవో సునంద తెలిపారు. కోరోనా వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించేందుకు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నామంటోన్న సునందతో 'ఈటీవి భారత్'​ ముఖాముఖి.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details