గుంటూరు జిల్లా నకరికల్లు మండలం కండ్లకుంట వద్ద గుంటూరు బ్రాంచ్ కెనాల్లో గల్లంతైన ఇద్దరి మృతదేహాలు సోమవారం లభ్యమయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుంటూరులోని వివిధ ప్రాంతాలకు చెందిన సురేష్, కోటేశ్వరరావు, అశోక్ అనే ముగ్గురు వ్యక్తులు నకరికల్లు మండలం చల్లగుండ్ల గ్రామంలో ఓ వేడుకకు హాజరై తిరుగు ప్రయాణంలో మార్గమధ్యలోని కండ్లకుంట గ్రామం వద్ద స్నానాలు చేసేందుకు గుంటూరు బ్రాంచ్ కెనాల్లో దిగి గల్లంతరయ్యారు. గమనించిన స్థానికులు సురేష్ మృతదేహాన్ని కాలువ నుంచి వెలికితీశారు.
గుంటూరు బ్రాంచ్ కెనాల్లో గల్లంతైన ఇద్దరి మృతదేహలు లభ్యం - గుంటూరు జిల్లా ప్రధాన వార్తలు
గుంటూరు బ్రాంచ్ కెనాల్లో ఆదివారం గల్లంతైన ఇద్దరి మృతదేహలు లభ్యమయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహలను నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
గుంటూరు బ్రాంచ్ కెనాల్లో గల్లంతైన ఇద్దరి మృతదేహలు లభ్యం
మిగిలిన ఇద్దరు వ్యక్తుల మృతదేహాలు కనిపించలేదు. సమాచారం అందుకున్న నకరికల్లు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరి మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం కోటేశ్వరరావు, అశోక్ ల మృతదేహాలు కండ్లకుంట శివారు కాలువలో లభ్యమయ్యాయి. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు... ముగ్గురి మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
ఇదీ చదవండి:
రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్‌కు ఫిర్యాదు