ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సత్తెనపల్లిలో అక్రమ ఆయుధాల కేసు.. ఇద్దరు అరెస్టు - Guntur Crime news

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో నాటు తుపాకీ చూపించి బెదిరింపులకు పాల్పడిన మాధవరెడ్డిని... అతని స్నేహితుడు రాజ్​కుమార్​పై పోలీసులు కేసు నమోదు చేశారు. వివాదాల కారణంగా బంధువులను బెదిరించాలనే రాజ్‌కుమార్ అనే వ్యక్తి సాయంతో మాధవరెడ్డి బిహార్‌లో రూ.50 వేలకు తుపాకీ కొనుగోలు చేసినట్టు గుర్తించారు.

విజయభాస్కర్ రెడ్డి, డీఎస్పీ
విజయభాస్కర్ రెడ్డి, డీఎస్పీ

By

Published : Mar 31, 2021, 9:42 PM IST

Updated : Mar 31, 2021, 10:38 PM IST

విజయభాస్కర్ రెడ్డి, డీఎస్పీ

బిహార్‌లో తయారైన నాటు తుపాకీ గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో కలకలం రేపింది. లండన్‌లో బీబీఎం, ఎంఎస్‌తో మంచి ఉద్యోగం చేసిన ఉన్నత విద్యావంతుడు తుపాకీతో పోలీసులకు చిక్కడం చర్చనీయాంశమైంది. గుంటూరు జిల్లా కందులవారిపాలెంకు చెందిన మాధవరెడ్డి తన భార్యతో విడాకులు తీసుకున్నాడు. అప్పటి నుంచి ఆమె బంధువులకు భయపడి తన రక్షణ కోసం స్నేహితుడి ద్వారా బీహార్ నుంచి నాటు తుపాకీని రహస్యంగా తెప్పించుకున్నాడని పోలీసులు వెల్లడించారు. బంధువులతో వివాదాల కారణంగా వారిని బెదిరించాలని రాజ్​కుమార్ సాయంతో మాధవరెడ్డి బీహార్ వెళ్లాడు. రూ.50 వేలతో నాటు తుపాకిని కొనుగోలు చేశాడని వివరించారు.

2019లో స్థానిక గుత్తేదారు కె.చెంచిరెడ్డి నుంచి రూ.58 లక్షలకు ప్రధాన నిందితుడు ఇల్లు కొనుగోలు చేశారు. ముందస్తుగా రూ.37 లక్షలు చెల్లించి మిగిలిన మొత్తం మూడు నెలల్లో చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. సొమ్ము సకాలంలో అందకపోవడంతో సమస్యలు తలెత్తాయి. వడ్డీతో కలిపి రూ.32 లక్షలు చెంచిరెడ్డి డిమాండ్‌ చేశారు. వడ్డీ లేకుండా మిగిలిన మొత్తం ఇస్తానని..ఇల్లు రిజిస్ట్రేషన్‌ చేయాలని కోరుతున్నా పట్టించుకోలేదు. మూడు రోజుల కిందట తారకరామసాగర్‌ వద్ద వాకింగ్‌ చేస్తున్న చెంచిరెడ్డికి తుపాకీ చూపి రిజిస్ట్రేషన్‌ చేస్తావా? చంపమంటావా? అంటూ బెదిరించారు. బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు మాధవరెడ్డి ఇంట్లో సోదాలు చేసి నాటు తుపాకీ, ఐదు రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.-విజయభాస్కర్ రెడ్డి, డీఎస్పీ

Last Updated : Mar 31, 2021, 10:38 PM IST

ABOUT THE AUTHOR

...view details