రాజధాని ప్రాంతంలో తెలంగాణ మద్యం విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను తుళ్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. తుళ్లూరు మండలం అనంతవరానికి చెందిన ఆలపాటి నరసింహరావు, ఆయన కుమారుడు నాగేశ్వరరావు కారులో 330 మద్యం సీసాలను తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో మరో వ్యక్తి పరారీలో ఉన్నారని.. అతన్ని త్వరలోనే పట్టుకుంటామని సీఐ దుర్గాప్రసాద్ చెప్పారు. గతంలోనూ వీరు మద్యం విక్రయించిననట్లు కేసులున్నాయని సీఐ తెలిపారు.
తెలంగాణ మద్యం విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్ - గుంటూరు జిల్లాలో ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
రాజధాని ప్రాంతంలో తెలంగాణ మద్యం విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను తుళ్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 330 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.
![తెలంగాణ మద్యం విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్ తెలంగాణ మద్యం విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11535569-441-11535569-1619359175531.jpg)
తెలంగాణ మద్యం విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్