Tobacco Board Members: పొగాకు బోర్డుకి నూతనంగా నలుగురు సభ్యులను నియమిస్తూ కేంద్రప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. పొగాకు బోర్డులో ఛైర్మన్ కాకుండా 10మంది సభ్యులు ఉంటారు. వారిలో కొందరి పదవీ కాలం ఇటీవలే ముగిసింది. వారి స్థానంలో కొత్తగా నలుగురిని నియమించారు. కొత్తగా సభ్యులుగా నియమితులైన వారిలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన బొడ్డపాటి బ్రహ్మయ్యకు రైతు కోటాలో సభ్యునిగా అవకాశం లభించింది. అలాగే ప్రకాశం జిల్లాకు చెందిన గుత్తా వాసుకి వ్యాపారుల కోటాలో అవకాశం దక్కింది.
పొగాకు బోర్డులో కొత్త సభ్యుల నియామకం.. రాష్ట్రం నుంచి ఇద్దరికి అవకాశం - Guntur District
Tobacco: పొగాకు బోర్డుకు కొత్తగా నలుగురు సభ్యులను కేంద్రప్రభుత్వం నియమించింది. నలుగురిలో రాష్ట్రం నుంచి ఇద్దరికి ఆవకాశం దక్కింది. రైతుల కోటా నుంచి ఒకరు.. వ్యాపారస్తుల కోటా నుంచి మరొకరికి ఛాన్స్ ఇచ్చారు.
పొగాకు బోర్డు
కర్ణాటకకు చెందిన పొగాకు రైతు జీసీ విక్రం రాజ్, పొగాకు మార్కెటింగ్ నిపుణులు బి.రమేష్‌ను సభ్యులుగా నియమించారు. కొత్తగా నియమితులైన వీరు మూడేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగుతారని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ తన గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొంది.
ఇవీ చదవండి: