భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలంటూ గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంలో అమరావతి దళిత ఐకాస నాయకులు 12గంటల దీక్ష చేపట్టారు. కరోనా నేపథ్యంలో అత్యవసర సేవలందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వం జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తోందని ఐకాస నేతలు విమర్శించారు. తక్షణమే ఒక్కో భవన నిర్మాణ కార్మికునికి 5వేల రూపాయల సాయం అందించాలని డిమాండ్ చేశారు.
'భవన నిర్మాణ కార్మికులకు రూ.5వేలు ఇవ్వాలి' - గుంటూరు జిల్లా నేటి వార్తలు
లాక్డౌన్తో ఇబ్బందులు పడుతున్న భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ అమరావతి దళిత ఐకాస నేతలు 12 గంటల దీక్ష చేపట్టారు. ప్రతి కార్మికుడికి ప్రభుత్వం రూ.5వేలు ఆర్థిక సహాయం అందించాలని కోరారు.
తూళ్లూరులో నిరసన