లాక్‌డౌన్‌తో రవాణా ఆగింది. పంట ఉత్పత్తుల ఎగుమతి, దిగుమతులు నిలిచిపోయాయి. ఫలితంగా జిల్లాలో పసుపు రైతుకు కొత్త సమస్య తలెత్తింది. కష్టకాలంలో ఉన్న అన్నదాతను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. క్వింటా రూ.6,850 చొప్పున గిట్టుబాటు ధర ప్రకటించింది.
కానీ... పసుపు కొనుగోళ్లకు అధికారులు ఆంక్షలు పెట్టడంతో పరిస్థితి మొదటికొచ్చింది. కేవలం ఈ కర్షక్‌లో నమోదైన రైతుల పంటను మాత్రమే కొనుగోలు చేస్తున్నట్లు చెబుతున్నారు. తొలుత ఒక్కో రైతు నుంచి 30 క్వింటాళ్లలోపే కొనుగోలు చేస్తామని ప్రకటించారు. తాజాగా 40 క్వింటాళ్లు కొనుగోలు చేసేలా నిర్ణయించారు.
అలాగే కొనుగోలుకు సంబంధించి టోకన్ల జారీలో నిర్లక్ష్యం నెలకొందని... చెల్లింపుల విషయంలోనూ జాప్యం జరుగుతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు.
కరోనా లేకుంటే..
పసుపు సాగుకు కడప జిల్లా పేరొందింది. 33 మండలాల్లో పంటను సాగు చేస్తున్నారు. కాలం కలిసొచ్చి ఉంటే.. దిగుబడిని మహారాష్ట్రకు తరలించి లాభపడేవారు. సౌత్‌జోన్ స్థాయిలో పసుపు క్రయవిక్రయాలు ఎక్కువగా జరిగే ఐదు ప్రాంతాల్లోనూ కరోనా విస్తరించి రెడ్‌జోన్లుగా మారాయి.
ఈ కారణంగా.. పంటను ఎక్కడికీ తరలించే వీలులేకుండా పోయింది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినా దిక్కులు చూడాల్సి వస్తోంది. యార్డులో బస్తా దించినందుకు హమాలీకి రూ.30, సంచికి రూ.40 రైతులే చెల్లించాల్సి వస్తోంది. ఎలాంటి ఆంక్షల్లేకుండా పసుపు కొనేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఈ కర్షక్‌లో నమోదైతేనే..