తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తుల వేలం పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. వేలం ప్రక్రియను మే నెలలోనే నిలిపివేశామనీ.. దీనికి సంబంధించి మే 28, గత నెల 30వ తేదీన వివరాలు సమర్పించినట్లు తితిదే స్టాడింగ్ కౌన్సిల్ సభ్యులు, హైకోర్టు సీనియర్ న్యాయవాది డాక్టర్ మజ్జి సూరిబాబు తెలిపారు. పిటిషనర్ ప్రస్తావించిన అంశాలతో పాటు, వేలం విషయంలో తీసుకున్న చర్యలపై సమగ్రమైన వివరణతో కౌంటర్ దాఖలు చేయాలని ద్విసభ్య ధర్మాసనం సూచించింది. తితిదే భూములు విక్రయించటం అన్యాయమని.. భవిష్యత్తులో కూడా భూములు విక్రయించకుండా ఉండేందుకు చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రత్యేకంగా ఒక జ్యూడిషియల్ కమిటీ వేసి, ఆస్తులను వాటి పర్యవేక్షణలో ఉంచాలని పిటిషనర్ ధర్మాసనాన్ని కోరారు.
తితిదే ఆస్తుల వేలంపై హైకోర్టులో విచారణ
తితిదే ఆస్తుల వేలంపై దాఖలైన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ ప్రస్తావించిన అంశాలతో పాటు.. వేలం విషయంలో తీసుకున్న చర్యలపై వివరణతో కూడిన కౌంటర్ దాఖలు చేయాలని ద్విసభ్య ధర్మాసనం సూచించింది.
తితిదే ఆస్తుల వేలంపై హైకోర్టులో విచారణ