ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్ల పరంపర.. మరో మూడు నోటిఫికేషన్లు విడుదల - Three more notifications from TSPSC

తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్ల పరంపర కొనసాగుతోంది. ఏడాది చివరి రోజున రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరో మూడు నోటిఫికేషన్లు విడుదల చేసింది... అవి ఏంటంటే?

తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్ల పరంపర.. మరో మూడు నోటిఫికేషన్లు విడుదల
తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్ల పరంపర.. మరో మూడు నోటిఫికేషన్లు విడుదల

By

Published : Dec 31, 2022, 10:33 PM IST

TSPSC latest notifactions: తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్ల పరంపర కొనసాగుతోంది. ఏడాది చివరి రోజున రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరో మూడు నోటిఫికేషన్లు విడుదల చేసింది. కళాశాల విద్యాశాఖలో 544 ఉద్యోగాల భర్తీకి ప్రకటన జారీ అయింది. డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్లు, ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్ల పోస్టులకు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 20 వరకు వీటికి దరఖాస్తులు స్వీకరిస్తారు. పురపాలక శాఖలో 78 అకౌంటెన్సీ ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదలయింది.

పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలో 64 సీనియర్ అకౌంటెంట్, 13 జూనియర్ అకౌంటెంట్, ఒక అకౌంట్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాల కోసం జనవరి 20 నుంచి ఫిబ్రవరి 11 వరకు టీఎస్‌పీఎస్‌సీ ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనుంది.

విద్యాశాఖలో 71 లైబ్రేరియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్ విద్య కమిషనరేట్‌లో 40, సాంకేతిక విద్యా శాఖలో 31 లైబ్రేరియన్ పోస్టులు ఉన్నాయి. లైబ్రేరియన్ పోస్టులకు జనవరి 21 నుంచి ఫిబ్రవరి 10 వరకు దరఖాస్తులు స్వీకరించి.. మే లేదా జూన్‌లో ఆబ్జెక్టివ్ పద్ధతిలో పరీక్ష నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్‌సీ వెల్లడించింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details