ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి... అక్రమాస్తులకు చెందిన వ్యవహారంలో లేపాక్షి నాలెడ్జ్ హబ్‌కు సంబంధించి సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ 13వ నిందితుడు వేసిన పినటిషన్‌ను తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. నిందితుడు బి.పి. కుమార్‌బాబు ఈ అభ్యర్ధనను చేయగా దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ విచారణ చేపట్టి శుక్రవారం తీర్పు వెలువరించారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి... ఇందూ శ్యాంప్రసాద్‌రెడ్డికి ప్రయోజనాలు కల్పించినందున ఆయన కుమారుడు జగన్‌కు చెందిన కంపెనీల్లోకి ముడుపులను మళ్లించడానికి బి.పి.కుమార్‌బాబు కీలకపాత్ర పోషించారన్న సీబీఐ ఆరోపణలను ఈ దశలో తోసిపుచ్చలేమని ధర్మసనం స్పష్టం చేసింది. ఛార్జిషీటు దశలోనే పిటిషనర్‌పై ఛార్జిషీటును రద్దు చేయడం అన్నది సరికాదని, అందువల్ల విచారణను అడ్డుకోడానికి ఈ కోర్టు ఆసక్తి చూపడం లేదన్నారు.
లేపాక్షి భూములపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ దాఖలైన పిటిషన్ తిరస్కరణ - జగన్ అక్రమాస్తుల కేసుపై తెలంగాణ హైకోర్టు విచారణ
లేపాక్షి భూములపై సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. జగన్ అక్రమాస్తుల కేసు 13వ నిందితుడు బి.పి. కూమార్ బాబు ఈ పిటిషన్‌ను ధర్మాసనం తిరస్కరించింది.
దీంతోపాటు జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో ఇందూ-ఏపీ గృహ నిర్మాణ మండలి కేసులో నిందితులుగా ఉన్న ఇందూ శ్యాంప్రసాద్‌రెడ్డి,... ఆయన డైరెక్టర్‌గా ఉన్న ఇందూ ప్రాజెక్ట్స్, సైబరాబాద్ హైటెక్ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్,ఇందూ ఈస్ట్రన్ ప్రావిన్స్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్, ఇందూ రాయల్ హోమ్స్‌లో సీబీఐ కోర్టు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలన్నఅభ్యర్ధనను హైకోర్టు తిరస్కరించింది.హాజరు మినహాయింపునకు సంబంధించి సుప్రీంకోర్టు వెలువరించిన అంశాలను ప్రస్తావిస్తూ ఎలాంటి కారణాలు, ఆధారాలను సమర్పించకుండా హాజరు మినహాయింపు ఇవ్వలేమన్నారు. అవసరమైన సందర్భాల్లో సీబీఐ కోర్టులో దరఖాస్తు చేసుకుని విచారణ నుంచి మినహాయింపు పొందవచ్చంటూ, పిటిషన్ కొట్టివేస్తూ తీర్పు వెలువరించారు.
ఇవీ చదవండి: