అమెరికాలో ఉంటున్న తెలుగు బాలిక అన్నపురెడ్డి శ్రావ్య సేవాగుణాన్ని చాటింది. కోవిడ్ వంటి విపత్కర సమయంలో కరోనా కట్టడిలో కృషి చేస్తున్న వివిధ విభాగాల సిబ్బందికి కుకీలు అందించింది. గుంటూరు జిల్లా బాపట్ల మండలం నరసాయపాలేనికి చెందిన అన్నపురెడ్డి సీతాకలామ్, విజయరెడ్డి కూతురే శ్రావ్య.
తల్లితండ్రులిద్దరూ వైద్యవృత్తిలో అమెరికాలో స్థిరపడ్డారు. వారి అండతో శ్రావ్య చేసిన సేవకు గానూ ఆమెను అమెరికాలోని శ్వేతసౌధంలో నిర్వహించిన కార్యక్రమంలో అధ్యక్షుడు ట్రంప్ ప్రశంసాపత్రం అందజేసి అభినందించారు. శ్రావ్య మేరీల్యాండ్‌లోని హన్నోవర్ హిల్స్ ప్రాథమిక పాఠశాలలో చదువుతోంది.