ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మోదీ మద్దతుతోనే సజ్జల ఆ వ్యాఖ్యలు చేశారు: ఎమ్మెల్సీ పల్లా - ప్రధాని మోదీ రాష్ట్రానికి వ్యతిరేకంగా కుట్రలు

Palla on Sajjala Comments: తెలంగాణ అభివృద్ధిని ఓర్వలేకనే ప్రధాని మోదీ రాష్ట్రానికి వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారని టీఆర్​ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి విమర్శించారు. ప్రధాని మోదీ దన్నుతోనే సజ్జల రామకృష్ణారెడ్డి ఆ వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. వైఎస్ షర్మిల భాజపాతో చీకటి ఒప్పందం చేసుకోని మోదీకి ఏజెంట్​గా పనిచేస్తున్నారని, ఎమ్మెల్సీ రాజేశ్వరరావు, ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ఆరోపించారు. నర్సంపేట ఘటనపై షర్మిల డ్రామా చేసి, ఈ ఘటనను రాజకీయం చేస్తోందని విమర్శించారు. షర్మిలకు వైఎస్‌ఆర్‌ బిడ్డ అని చెప్పుకునే అర్హత లేదని అన్నారు.

palla on sajjala
palla on sajjala

By

Published : Dec 8, 2022, 8:18 PM IST

Palla on Sajjala Comments: తెలంగాణ అన్నిరంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకెళ్లడాన్ని ఓర్వలేకనే ప్రధాని మోదీ రాష్ట్రానికి వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారని టీఆర్​ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి విమర్శించారు. ప్రధాని మోదీ దన్నుతోనే సజ్జల రామకృష్ణారెడ్డి ఆ వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. పోతిరెడ్డిపాడు నుంచి మొత్తం నీళ్లు తరలించేందుకు, పులిచింతల ద్వారా తెలంగాణను ముంపునకు గురిచేసి నీళ్లుతీసుకోవడం సహా పోలవరం ఎత్తు పెంచి భద్రాచలం ముంపునకు యత్నించారని పల్లా ఆరోపించారు. నీళ్లు, నిధులు, నియామకాల్లో టీఆర్​ఎస్ సర్కారు ఏనాడూ వెనక్కి తగ్గలేదని గుర్తుచేశారు.

మోదీ మద్దతుతోనే సజ్జల ఆ వ్యాఖ్యలు చేశారు: ఎమ్మెల్సీ పల్లా

వైఎస్​ఆర్​సీపీ నాయకుడు సజ్జల రామకృష్ణరెడ్డి మాట్లాడుతూ, ఇవ్వాళ చాలా వికృతంగా విషపు ఆలోచనలతో మాట్లాడటం జరిగింది. విభజన చట్టమే అసంబద్ధమని, విభజనకు మేమందరం వ్యతిరేకం అన్న వారందరు... విభజనకు వ్యతిరేకంగా కోర్టులో కేసులు వేసినమని అది మరలా కలవాలని, దాని కోసం ప్రయత్నం చేస్తున్నామని విషపు మాటలు మాట్లాడటం జరిగింది. ఈనాడు వైఎస్​ఆర్​సీపీ నాయకులు మాట్లాడితే కూడా వారు సొంతంగా మాట్లాడారని చెప్పి మేము అనుకోట్లేదు. కచ్చితంగా గత రెండు మూడు రోజులుగా మోదీగారు వైఎస్​ఆర్​సీపీ నాయకులతో కలిసి వాళ్లను ప్రేరేపించి, కుట్ర చేస్తున్నారు తప్ప మరొక్కటి లేదు. -పల్లా రాజేశ్వర్‌రెడ్డి, టీఆర్​ఎస్ ఎమ్మెల్సీ

Palla RajeshwarRao Comments on Sharmila: వైఎస్ షర్మిల భాజపాతో చీకటి ఒప్పందం చేసుకొని, మోదీకి ఏజెంట్​గా పనిచేస్తున్నారని టీఆర్​ఎస్ ఎమ్మెల్సీ రాజేశ్వరరావు, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ఆరోపించారు. తెలంగాణను అల్లకల్లోలం చేసేందుకు షర్మిల కుట్ర చేస్తుందని మండిపడ్డారు. అసెంబ్లీ ప్రాంగణంలోని టీఆర్‌ఎస్ఎల్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన నేతలు.. షర్మిల పాదయాత్రకు బీజేపీ ప్రజలను సమీకరిస్తోందని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్​రావు తెలిపారు.

నర్సంపేట ఘటనపై షర్మిల డ్రామా చేస్తుందని, ఈ ఘటనను రాజకీయం చేస్తోందని విమర్శించారు. షర్మిలకు వైఎస్‌ఆర్‌ బిడ్డ అని చెప్పుకునే అర్హత లేదని స్పష్టం చేశారు. వైఎస్‌ఆర్ జీవితాంతం బీజేపీ, ఆర్​ఎస్​ఎస్​లకు వ్యతిరేకంగా పోరాడారని, అదే బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌తో షర్మిల చేతులు కలిపి పనిచేస్తుందని దుయ్యబట్టారు. కేసీఆర్ పాలనపై ఆమె అడ్డగోలు విమర్శలు చేస్తున్నారని, మైనార్టీలు కేసీఆర్ పాలనలో సురక్షితంగా ఉన్నారని పేర్కొన్నారు.

షర్మిల తీరును ముక్తకంఠంతో ఖండిస్తున్నామని తెలిపారు. కేసీఆర్ ఎజెండా దేశమంతా అమలు కావాలంటే బీఆర్‌ఎస్ రావాలని పల్లా అన్నారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్‌పై రంగనాథ్ మిశ్రా కమిషన్ సిఫారసులను మోదీ ప్రభుత్వం వ్యతిరేకించడం దుర్మార్గమన్నారు. తెలంగాణలో శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టాలని ఆమె ప్రయత్నించడం సరికాదని నామినేటేడ్‌ ఎమ్మెల్యే ఎల్వీస్ స్టీఫెన్‌ సన్‌ అన్నారు. తెలంగాణలో శాంతి ఉన్నందునే అభివృద్ది జరుగుతుందని పేర్కొన్నారు. కేసీఆర్‌ను తిట్టడం ద్వారా షర్మిల తెలంగాణ ప్రజలను అవమానపరుస్తున్నారని తెలిపారు. కేసీఆర్​పై అర్థంలేని విమర్శలు చేయడం ఆపితే ఆమెకే మంచిదన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details