ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ట్రాలీ ఆటో బోల్తా.. ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు - Road Accidents in AP news

గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం తిమ్మాపురం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. డివైడర్‌ను ఢీకొని ఆటో బోల్తా పడింది. ఒకరు మృతిచెందగా... ఇద్దరికి గాయాలయ్యాయి. ప్రమాదానికి గురైన ఆటో విజయవాడ నుంచి ఒంగోలు వెళ్తోంది.

ట్రాలీ ఆటో బోల్తా
ట్రాలీ ఆటో బోల్తా

By

Published : May 9, 2021, 11:43 AM IST

గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం తిమ్మాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. విజయవాడ నుంచి ఆరుగురు వ్యక్తులతో ఒంగోలు వైపు వస్తున్న ట్రాలీ ఆటో... తిమ్మాపురం వద్ద అదుపుతప్పి డివైడర్​ను ఢీకొట్టి బోల్తా పడింది. ఒకరు మృతిచెందగా... ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో ప్రకాశం జిల్లా పొదిలి సమీపంలోని గాజులపల్లి గ్రామానికి చెందిన కోనంకి నరసయ్య (80) అక్కడికక్కడే మృతిచెందారు. యడ్లపాడు ఎస్సై రాంబాబు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

ABOUT THE AUTHOR

...view details