గుంటూరు రేంజ్ డీఐజీగా త్రివిక్రం వర్మ బాధ్యతలు స్వీకరించారు. ఆయన్ను అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డితో పాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. మహిళా భద్రతకు, శాంతి భద్రతల పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తామని డీఐజీ త్రివిక్రం వర్మ తెలిపారు.
మద్యం రవాణా అరికట్టడంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు. పారదర్శకతతో పనిచేస్తామని తెలిపారు. హోం మంత్రి ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె డీఐజీకి శుభాకాంక్షలు తెలిపారు.