ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఉన్నత విద్యను ప్రైవేట్ పరం చేసేలా కేంద్రం విధానం' - ఉన్నత విద్యను ప్రైవేట్ పరం చేసే విధం

గుంటూరు స్థానిక నేతలు మాజీ ఎమ్మెల్సీ మాణిక్యరావు వర్ధంతిని నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రతిఒక్కరూ నడుచుకోవలని సూచించారు.

Tribute to former MLC Manikyarao
అధ్యాపక ఉద్యమనేత మాజీ ఎమ్మెల్సీ మణిక్యరావుకు నివాళి

By

Published : Nov 16, 2020, 5:33 PM IST

గుంటూరులో అధ్యాపక ఉద్యమనేత మాజీ ఎమ్మెల్సీ మాణిక్యరావు 12వ వర్ధంతిని నిర్వహించారు. స్థానికంగా ఉన్న ఏసీ కళాశాల కూడలి వద్ద ఆయన విగ్రహానికి ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు, మద్యవిమోచన కమిటీ ఛైర్మన్ లక్ష్మణ్ రెడ్డి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం వల్ల ఉపాధ్యాయులు, అధ్యాపకులు నష్ట పోయే ప్రమాదం ఉందన్నారు.

ఉన్నత విద్యను ప్రైవేట్ పరం చేసే విధంగా నూతన విద్యా విధానం ఉందని తెలిపారు. విద్య విషయంలో రాష్ట్ర ప్రభుత్వ పాత్ర గణనీయంగా ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్సీ మణిక్యరావు ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details