జగనన్న చేయూత పథకం జాబితాల నుంచి తమ పేర్లు తొలగించి వాలంటీర్లు అన్యాయం చేశారంటూ గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్‌కు బాధితులు ఫిర్యాదు చేశారు. జగనన్న గృహ నిర్మాణ పథకం శంకుస్థాపన మహోత్సవం కార్యక్రమానికి వచ్చిన జిల్లా పాలనాధికారికి వినుకొండ మండలం కొప్పుకొండ తండా గిరిజన మహిళలు తమ సమస్యను తెలిపారు.
వాలంటీర్లపై చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్‌కు ఫిర్యాదు - tribal women complained to district collector news
జగనన్న చేయూత పథకం జాబితా నుంచి తమ పేర్లు తొలగించారంటూ గుంటూరు జిల్లా వినుకొండ మండలం కొప్పుకొండ తండా గిరిజన మహిళలు కలెక్టర్ వివేక్ యాదవ్‌కు ఫిర్యాదు చేశారు. గతేడాది లబ్ధిదారులుగా ఉన్న వారి పేర్లు.. ఈ సంవత్సరం జాబితాలో తీసివేశారని వాపోయారు.
గతేడాది చేయూత పథకం కింద రూ.18,700 తీసుకున్నామని చెప్పారు. ఈ సారి లబ్ధిదారులుగా తమ వివరాలు నమోదు చేసేందుకు వాలంటీర్లు రూ.5000 చెల్లించాలని డిమాండ్ చేసినట్లు చెప్పారు. వారికి డబ్బులు ఇవ్వకపోవటంతో తమ వివరాలు లబ్ధిదారుల జాబితాలో చేర్చలేదని బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు అన్యాయం చేసిన వాలంటీర్లపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. జగనన్న చేయూత పథకం తమకు వర్తించేయాలని విన్నవించారు. దీనిపై వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్... బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని తహసీల్దార్ అనిల్ కుమార్‌కు ఆదేశించారు.
ఇదీ చదవండి:'ఇసుక డంపింగ్‌తో కరకట్ట మనుగడ ప్రశ్నార్ధకం'