రవాణాశాఖ సేవల కోసం ప్రతి ఒక్కరూ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదని గుంటూరు జిల్లా ఉపరవాణా కమిషనర్ మీరా ప్రసాద్ తెలిపారు. అవసరమైన సేవలు గ్రామ, వార్డు సచివాలయాల్లో పొందవచ్చని స్పష్టం చేశారు. కొవిడ్ వేళ కార్యాలయానికి రాకుండా గ్రామంలో ఉన్న సచివాలయ వ్యవస్థ ద్వారా కావాల్సిన సేవల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని..అంతర్జాలం ఉన్నవారు ఇంటి నుంచైనా సంబంధిత సేవలను పొందవచ్చని సూచించారు. aprtacitizen.epragathi.org వెబ్ పోర్టల్ ద్వారా రవాణాశాఖ సేవలు పొందవచ్చని కమిషనర్ వెల్లడించారు.
గ్రామ సచివాలయాల్లోనే రవాణా శాఖ సేవలు - గుంటూరు తాజా వార్తలు
గ్రామ, వార్డు సచివాలయాల్లోనే సేవలు అందించడానికి రవాణా శాఖ ఏర్పాట్లు చేసింది. సచివాలయాల్లోనే 54 రకాల పనులు పూర్తి చేసుకోవచ్చని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. గత రెండు నెలల క్రితమే ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చినా.. ప్రజల్లో అవగాహన లేని కారణంగా స్పందన అంతంత మాత్రంగానే ఉంది.
గ్రామ సచివాలయాల్లోనే రవాణా శాఖ సేవలు