ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Jr Civil Judges transfers: రాష్ట్ర వ్యాప్తంగా 62 మంది జూనియర్‌ సివిల్‌ జడ్జిల బదిలీ - Civil Judges Transfer news

రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్‌ సివిల్‌ జడ్జిలను హైకోర్టు బదిలీ చేసింది. 62 మందిని వివిధ ప్రాంతాలకు బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.

Transfer of 62 Junior Civil Judges
రాష్ట్రవ్యాప్తంగా 62 మంది జూనియర్‌ సివిల్‌ జడ్జిల బదిలీ

By

Published : Jul 24, 2021, 8:55 AM IST

రాష్ట్ర వ్యాప్తంగా 62 మంది జూనియర్‌ సివిల్‌ జడ్జిలను బదిలీ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మూడురోజుల క్రితం 68 జూనియర్ సివిల్ జడ్జి పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది. నేరుగా నియామకం ద్వారా 55, బదిలీల ద్వారా 13 పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుతో పాటు ప్రకటనకు సంబంధించిన పూర్తి వివరాలు హైకోర్టు అధికారిక వెబ్ సైట్​లో పొందుపరిచారు.

ఆన్​లైన్ ద్వారా దరఖాస్తు సమర్పించేందుకు చివరి తేది ఆగస్టు 20 అని హైకోర్టు రిజిస్ట్రార్ సునీత పేర్కొన్నారు. వారం క్రితం రాష్ట్రంలోని వివిధ న్యాయస్థానాల్లో పనిచేస్తున్న 25 మంది సీనియర్‌ సివిల్‌ జడ్జీల బదిలీ అయ్యింది. ఆగస్టు 2లోపు వారు ప్రస్తుతం పనిచేస్తున్న స్థానాలను వదిలి.. కొత్తగా పోస్టింగ్‌ ఇచ్చిన చోట బాధ్యతలు స్వీకరించాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

ABOUT THE AUTHOR

...view details