గుంటూరు జిల్లా వినుకొండలోని జాషువా కళాప్రాంగణంలో మున్సిపల్ కమిషనర్ బి.శ్రీనివాసులు.. కౌంటింగ్ సూపర్ వైజర్స్, అసిస్టెంట్లు, రిజర్వ్ అసిస్టెంట్లకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. మార్చి 14న చేపట్టనున్న ఓట్ల లెక్కింపునకు 44 టేబుల్స్ ఏర్పాటు చేసినట్లు శ్రీనివాసులు చెప్పారు. ఎన్నికల అధికారి వెంకటప్పయ్య పర్యవేక్షణలో ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రం వద్దకు సెల్ఫోన్లు అనుమతి లేదన్నారు.
ఓట్ల లెక్కింపు సిబ్బందికి శిక్షణా కార్యక్రమం - గుంటూరు జిల్లా మున్సిపల్ ఓట్ల లెక్కింపు వార్తలు
వినుకొండ ఓట్ల లెక్కింపు సిబ్బందికి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఫలితాలను ఒకేసారి ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని శ్రీనివాసులు చెప్పారు.

ఓట్ల లెక్కింపు సిబ్బందికి శిక్షణా కార్యక్రమం