ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆహార పదార్థాల కల్తీపై కేంద్రం దృష్టి... నియంత్రణపై శిక్షణ

ఆహార పదార్థాల కల్తీ నిరోధంపై కేంద్రం దృష్టి సారించింది. వ్యాపారులతో పాటు ఆహార పదార్థాల విక్రయాలతో సంబంధమున్న వారందరికీ...... కల్తీ నియంత్రణపై శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. తదనంతర పరీక్షలో ఉత్తీర్ణులైతేనే వ్యాపారానికి అనుమతి లభించనుంది. ఆహార కల్తీ నియంత్రణపై దేశవ్యాప్తంగా శిక్షణా కార్యక్రమాలు ఇప్పటికే మొదలయ్యాయి..

training-on-food-adulteration
ఆహార పదార్థాల కల్తీపై కేంద్రం దృష్టి

By

Published : Dec 7, 2020, 6:39 AM IST

ఆహార పదార్థాల కల్తీపై కేంద్రం దృష్టి

ఆహార పదార్థాల్లో కల్తీ.... చాలా చోట్ల కలవరపెడుతోంది. హోటళ్లు, రెస్టారెంట్లలో రోజుల తరబడి నిల్వ ఉంచుతున్న ఆహార పదార్థాల వల్ల.... ఆరోగ్యానికీ చేటు కలుగుతోంది. ఈ నేపథ్యంలో.... కల్తీకి అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం శిక్షణా తరగతులు చేపడుతోంది. రెండేళ్ల క్రితమే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినా.... ఇప్పుడు జోరు పెంచింది. చిల్లర దుకాణదారుడి నుంచి పెద్ద హోటళ్ల యజమానులు, ఆహార పదార్థాల విక్రయాలతో సంబంధముండే.... ప్రతి ఒక్కరికీ కల్తీపై అవగాహన కల్పిస్తున్నారు. శిక్షణాననంతరం పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణులైతే ధ్రువీకరణ పత్రం అందజేస్తారు. అది లేనివారికి లైసెన్సులు క్రమబద్ధీకరించబోమని..... ఆహార కల్తీ నియంత్రణ అధికారులు చెబుతున్నారు.

కనీస అవగాహన లేకపోవడం వల్లే ఆహార కల్తీ జరుగుతోందని.... ఆహారమెలా ఉండాలో, ప్రభుత్వ నియమనిబంధనలు ఏంటో శిక్షణా తరగతుల్లో చెప్తున్నామని నిపుణులంటున్నారు..

ABOUT THE AUTHOR

...view details