Train stopped: గుంటూరు జిల్లా తాడేపల్లి కృష్ణాకెనాల్ జంక్షన్ వద్ద హౌరా - కొచ్చి ఎక్స్‌ప్రెస్ రైలు గంట సేపు నిలిచిపోయింది. అయ్యప్ప భక్తులకు, బిహార్ ప్రయాణికులకు మధ్య బెర్తుల విషయంలో ఘర్షణ తలెత్తడంతో రైలు నిలిచిపోయింది. అయ్యప్ప భక్తుల బెర్తులను బిహారు ప్రయాణికులు ఆక్రమించడంతో రైలు కృష్ణా కెనాలు రాగానే అయ్యప్ప భక్తులు చైన్‌లాగి అపేశారు. రంగలోకి దిగిన రైల్వే పోలీసులు ఇరు వర్గాల మధ్య ఘర్షణను నివారించారు. ఈ క్రమంలో రైలు కృష్ణా కెనాల్‌పై గంటసేపు నిలిచిపోయింది. సరైన టికెట్లు లేని బిహార్ ప్రయాణికులను దింపేసి విజయవాడకు తరలించారు. అయ్యప్ప భక్తులకు తమ బెర్తులు దక్కడంతో వివాదం ముగిసింది.
అయ్యప్ప భక్తులకు, బిహార్ ప్రయాణికులకు మధ్య ఘర్షణ.. నిలిచిన రైలు - తాడేపల్లి
Train stopped: అయ్యప్ప భక్తులకు, బిహార్ ప్రయాణికులకు మధ్య బెర్తుల విషయంలో ఘర్షణ జరిగింది. దీంతో గుంటూరు జిల్లా తాడేపల్లి కృష్ణాకెనాల్ జంక్షన్ వద్ద హౌరా - కొచ్చి ఎక్స్‌ప్రెస్ రైలు గంట సేపు నిలిచిపోయింది. రంగలోకి దిగిన రైల్వే పోలీసులు ఇరు వర్గాల మధ్య ఘర్షణను నిలువరించారు. సరైన టికెట్లు లేని బిహార్ ప్రయాణికులను దింపేసి విజయవాడ తరలించారు.

రంగంలోకి దిగి ఘర్షణ నిలువరించిన రైల్వే పోలీసులు
అయ్యప్ప భక్తులకు, బిహార్ ప్రయాణికులకు మధ్య ఘర్షణతో నిలిచిన రైలు