విద్యుదాఘాతంతో మంటలు చెలరేగి వ్యక్తి సజీవదహనం - ఏపీ తాజా వార్తలు
![విద్యుదాఘాతంతో మంటలు చెలరేగి వ్యక్తి సజీవదహనం Mandal Takkellapadu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13215038-640-13215038-1632976594591.jpg)
Mandal Takkellapadu
08:03 September 30
గుంటూరు జిల్లా దాచేపల్లిలో దారుణం
గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం తక్కెళ్లపాడులో విషాదం నెలకొంది. విద్యుదాఘాతంతో మంటలు చెలరేగి వ్యక్తి సజీవదహనం అయ్యారు. మృతుడు జక్క లక్ష్మీనారాయణ(45) గా గుర్తించారు. విద్యుదాఘాతంతో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అప్పటికే ఇంట్లో నిద్రిస్తున్న లక్ష్మీనారాయణ సజీవదహనం అయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Last Updated : Sep 30, 2021, 10:26 AM IST