ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తాడేపల్లిలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ప్రారంభం - guntur urban sp

వాహనాల రద్దీని క్రమబద్దీకరించేందుకు గుంటూరు జిల్లా తాడేపల్లిలో నూతనంగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్​ను ఏర్పాటు చేసారు. ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రులిద్దరు ఒకే మండలంలో ఉండటం వల్ల ట్రాఫిక్ పెరిగందని ఎస్పీ రామకృష్ణ తెలిపారు.

తాడేపల్లిలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ప్రారంభం

By

Published : Jul 19, 2019, 10:12 PM IST

తాడేపల్లిలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ప్రారంభం

గుంటూరులోని తాడేపల్లిలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్​ను గుంటూరు అర్బన్ ఎస్పీ రామకృష్ణ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ...ముఖ్యమంత్రి జగన్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇద్దరు ఒకేచోట ఉండటంతో ట్రాఫిక్ ఆంక్షలు ఎక్కువయ్యాయని ఆయన తెలిపారు. ఇంతవరకు శాంతి భద్రతలు నిర్వహించే పోలీసులే ట్రాఫిక్ విధుల్లో ఉన్నారని... దీని వల్ల సిబ్బంది కొరత ఏర్పడిందన్నారు. ఈ లోటును తీర్చేందుకు నూతన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి లేఖ రాశామని ఎస్పీ తెలిపారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే 32 మంది సిబ్బందిని కేటాయించి నూతన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్​ను ఏర్పాటు చేస్తామని వివరించారు.

ABOUT THE AUTHOR

...view details