ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బస్తాల అడుగుల్లో 'మిర్చి వ్యర్థాలు'.. గుంటూరు యార్డులో కల్తీ కథలు

గుంటూరు మార్కెట్‌ యార్డు కేంద్రంగా వ్యాపారులు కల్తీకి పాల్పడుతుండటం అధికారుల దృష్టికి వెళ్లింది. మిర్చి తొడిమలు, వృథా సరకుని జోడించి బస్తాల్లో నింపేస్తున్న విషయం.. యార్డు సిబ్బంది తనిఖీల్లో బట్టబయలైంది.

By

Published : Nov 28, 2020, 7:15 PM IST

traders are committing fraud on chilli at the Guntur Market Yard Center
మిర్చి వృథా సరకుని బస్తాల్లో నింపుతున్న కల్తీ రాయుళ్లు... నిఘా పెంచుతున్న అధికారులు

మిర్చి వృథా సరకుని బస్తాల్లో నింపుతున్న కల్తీ రాయుళ్లు... నిఘా పెంచుతున్న అధికారులు

అంతర్జాతీయంగా మంచి డిమాండ్‌ ఉన్న గుంటూరు మిర్చి... విదేశాలకూ ఎగుమతి అవుతోంది. మేలు రకాలతో పాటు నాసిరకం మిర్చికీ మంచి ధరే లభిస్తోంది. ప్రస్తుతం మిర్చి తాలు కాయలకు కూడా క్వింటాలుకు 7వేల రూపాయల ధర పలుకుతోంది. ఇదే కొందరు వ్యాపారులకు వరంగా మారింది. మిర్చి తొడిమలు, విత్తనాలు, మిరప ముక్కలు వంటి వ్యర్థాలను సేకరించి... తాలు కాయల్లో కలిపేస్తున్నారు. బస్తాల అడుగు భాగంలో వృథా సరకు వేసి... దానిపై తాలు కాయలు పొరలుగా పోస్తున్నారు. మిర్చి యార్డులో చివర్లో ఉండే దుకాణాలను... కల్తీలకు కేంద్రంగా ఎంచుకున్నారు. ఇద్దరు ఏజెంట్లు, మరికొందరు వ్యాపారులు కలిసి ఈ అక్రమ దందా నడిపిస్తున్నారు.

తాలు కాయలకు లభిస్తున్న ధర... ఈ కల్తీ సరకుకు వస్తుండటంతో కల్తీ రాయుళ్ల వ్యాపారం లాభసాటిగా మారింది. కల్తీ వ్యవహారాన్ని నిర్ధరించుకున్న మిర్చియార్డు సిబ్బంది... వెంటనే పైఅధికారులకు సమాచారమిచ్చారు. ఇక నుంచి నిఘా పెంచుతామని... అక్రమాలకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. 2016లో కల్తీ కారం తయారుచేస్తున్న కొందరిపై విజిలెన్స్ అధికారులు కేసులు నమోదు చేసి చర్యలు తీసుకున్నారు. ఆ తర్వాత అక్రమాలు ఆగిపోయాయని అంతా భావించారు. ఇప్పుడు ఏకంగా గుంటూరు మిర్చియార్డులోనే సరకు కల్తీ చేస్తున్న వైనం వెలుగులోకి రావడం విస్మయం కలిగిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details