'ట్రాఫిక్ నిబంధనలపై పోలీసుల అవగాహన కార్యక్రమం' - రేపల్లె
ప్రతి ఒక్క వాహన దారుడు డ్రైవింగ్ లైసెన్సు తీసుకోవాలని రేపల్లె సిఐ కోరారు.ప్రజా శాంతి భద్రతలలో భాగంగా చట్ట వ్యతిరేక చర్యలకు దిగుతున్న వారిని అదుపులోకి తీసుకుని,చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.
'ట్రాఫిక్ నిబంధనలపై పోలీసుల అవగాహన కార్యక్రమం'
లైసెన్స్ లేకుండా ట్రిపుల్ రైడింగ్,రాష్ డ్రైవింగ్ చేస్తున్న యువకుల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇస్తున్నామన్నారు గుంటూరు జిల్లా రేపల్లె పట్టణ సిఐ సాంబశివరావు. మరోసారి ఇలా పట్టుపడితే సంబంధిత వాహన యజమాని లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. 25 ద్విచక్ర వాహనాలును, 6 మట్టి ట్రాక్టర్లను సీజ్ చేసి చలాన విధించారు. చట్ట వ్యతిరేక పనులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు.