ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి - గుంటూరు జిల్లాలో ట్రాక్టర్ బోల్తా

ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మరణించిన ఘటన గుంటూరు జిల్లా నగరం మండలంలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tractor rolled ... the person died
ట్రాక్టర్ బోల్తా...వ్యక్తి మృతి

By

Published : Mar 16, 2020, 9:20 PM IST

ట్రాక్టర్ బోల్తా...వ్యక్తి మృతి

గుంటూరు జిల్లా నగరం మండలంలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడి ఒక వ్యక్తి మృతి చెందాడు. నాగండ్లవారిపాలెం శివారులో రొయ్యలు చెరువులు ఉన్నాయి. సంవత్సర కాలంగా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన 10 కుటుంబాలు చెరువులకు కాపలాగా ఉంటున్నాయి. పనిలో భాగంగా సర్వేశ్వరరావు (35)అనే వ్యక్తి గట్టుపై ఉన్న ట్రాక్టర్ ఎక్కి కూర్చొని ఉండగా...ట్రాక్టర్ ఒక్కసారిగా వెనకకు జారీ మురుగు కాల్వలో పడింది. దీనితో వాహనంపైనున్న వ్యక్తి బురదలో పడటంతో అతనిపై ట్రాక్టర్ పడి ఊపిరి ఆడక మరణించాడు. గమనించిన స్థానికులు వెంటనే రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా...అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి 8 ఏళ్ళ కుమార్తె, 4 ఏళ్ల కుమారుడు ఉన్నారు. పని కోసం వలస వచ్చి ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

ఇదీ చూడండి:ప్రభుత్వ పనులకు సిమెంటు ధరలు తగ్గింపు

ABOUT THE AUTHOR

...view details