కాలువలో బోల్తాపడ్డ ట్రాక్టర్..ఇద్దరు మృతి - Tractor overturns in Guntur district
గుంటూరు జిల్లా కంకటపాలెం పేరలిలో ట్రాక్టర్ ప్రమాదవశాత్తు కాల్వలో బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా...ముగ్గురికి గాయాలయ్యాయి.
ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు వ్యవసాయ కూలీలు మృతి చెందిన ఘటన గుంటూరు జిల్లా కంకటపాలెం పేరలిలో జరిగింది. మృతులు పిండిబోయిన శ్రీనివాసరావు, మద్దిబోయిన శ్రీనుగా గుర్తించారు. కంకటపాలెంలో వ్యవసాయ పనుల నిమిత్తం వరి నారు తెచ్చి.. తిరిగి వెళ్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కాల్వలో బోల్తా పడింది. ట్రాక్టర్లో ఐదుగురు కూలీలు ఉండగా ఇద్దరు మృతి చెందారు. ముగ్గురికి గాయాలయ్యాయి. వారిని బాపట్ల ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సంఘటన స్థలాన్ని గ్రామీణ పోలీసులు పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను వెలికితీసి ఏరియా ఆసుపత్రికి తరలించారు.