ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన ట్రాక్టర్​.. అన్న మృతి, తమ్ముడికి గాయాలు - గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం

ఇద్దరు అన్నదమ్ములు కళాశాలకు వెళ్తుండగా.. మృత్యువు ట్రాక్టర్​ రూపంలో దూసుకువచ్చింది. వారు ప్రయాణిస్తున్న బైక్​ను ట్రాక్టర్​ ఢీకొట్టింది. అన్న అక్కడిక్కక్కడే ప్రాణాలుకోల్పోగా.. తీవ్ర గాయాలతో తమ్ముడు ఆసుపత్రి చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా తెనాలిలోని బుర్రిపాలెం రోడ్డులో జరిగింది.

tractor hits the bike one died
ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ట్రాక్టర్

By

Published : Mar 24, 2021, 3:37 PM IST

ద్విచక్ర వాహనాన్ని ట్రాక్టర్​ ఢీకొట్టిన ఘటనలో... బైక్​పై వెళ్తున్న ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు ట్రాక్టరు చక్రాల కింద పడ్డారు. ఆ విద్యార్థులిద్దరూ అన్నదమ్ములు. ప్రమాదంలో.. అన్న అక్కడికక్కడే మృతి చెందగా.. తమ్ముడికి గాయాలయ్యాయి.

ఈ ఘటన గుంటూరు జిల్లా.. తెనాలిలోని బుర్రిపాలెం రోడ్డులో జరిగింది. తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్న క్షతగాత్రుడిని తెనాలి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిద్దరు తెనాలిలోని ఓ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులుగా సమాచారం.

ABOUT THE AUTHOR

...view details