ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ముట్టుకోకుండానే శానిటైజర్...

దేశంలో కరోనా మహమ్మారి నిశబ్దంగా తన ప్రతాపాన్ని చూపుతోంది. అధికారులు ఎప్పటికప్పుడు నివారణ చర్యలు చేపడుతూనే ఉన్నారు. తాజాగా...గుంటూరు జిల్లాలోని కలెక్టర్ కార్యాలయంలో టచ్ లెస్ శానిటైజేషన్ డిస్పెన్సెర్ మిషన్​ను జిల్లా కలెక్టర్ ఐ.శామ్యూల్ ఆనంద్ కుమార్ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో...కార్యాలయ సిబ్బంది, సందర్శకులకు తగు జాగ్రత్తలు సూచించారు.

touchless sanitizer dispencer mechine launched at guntur
టచ్ లెస్ శానిటైజేషన్ డిస్పెన్సెర్ మిషన్​ను ప్రారంభిస్తున్న కలెక్టర్​

By

Published : Jun 4, 2020, 9:08 AM IST

ప్రస్తుతం ఉన్న కరోనా నివారణ చర్యల్లో భాగంగా గుంటూరు జిల్లాలోని అధికారులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో టచ్ లెస్ శానిటైజేషన్ డిస్పెన్సెర్ మిషన్ ను జిల్లా కలెక్టర్ ఐ.శామ్యూల్ ఆనంద్ కుమార్ ప్రారంభించారు. కరోనా వైరస్​ను అరికట్టాలంటే కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది, సందర్శకులు తరచూ చేతులు శుభ్రపరచుకోవాలన్నారు. ఈ మిషన్... చేతులతో తాకే అవసరం లేకుండానే సెన్సార్ ద్వారా చేతుల పైకి శానిటైజర్ ను, నిర్దేశిత ప్రమాణంలో విడుదల చేస్తుందన్నారు. దీనిని ప్రతిఒక్కరు సద్వినియోగపరచుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ కోరారు.

ఇదీ చదవండి


ప్రతిధ్వని: అమెరికాలో ఆగ్రహ జ్వాలలపై చర్చ

ABOUT THE AUTHOR

...view details