- సీఎం జగన్ పుట్టినరోజు.. శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు
CM JAGAN BIRTHDAY CELEBRATIONS: తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు వైభవంగా జరిగాయి. పలువురు ఉన్నతాధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- తెలంగాణను అభివృద్ధి చేసింది టీడీపీనే: చంద్రబాబు
TDP Chief Chandrababu comments: తెలంగాణను అభివృద్ధి చేసింది టీడీపీనే అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పేర్కొన్నారు. ఖమ్మంలో టీడీపీ నిర్వహిస్తున్న బహిరంగ సభలో పాల్గొనేందుకు బయల్దేరిన చంద్రబాబు నాయుడు కూసుమంచి మండలం కేశవాపురంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఏ క్షణానైనా సమ్మెకు దిగుతాం.. 108 సర్వీసెస్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్
108 emergency services employees: 108 సిబ్బందికి ఇచ్చిన హామీలు పరిష్కరించకుంటే జనవరి 15 తరువాత ఏ క్షణమైనా సమ్మెకు దిగుతామని ఆంధ్రప్రదేశ్ 108 సర్వీసేస్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు ప్రకటించారు. సీఎం అధికారంలోకి వస్తే తమను ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగులుగా నియమిస్తానని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడుస్తున్నా తమకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- చదువు అనే ఆస్తితోనే.. విద్యార్థుల తలరాతలు మారుతాయి: సీఎం
TABS DISTRIBUTION IN AP : ప్రభుత్వ బడుల్లో డిజిటల్ విప్లవానికి శ్రీకారం చుట్టామని.. ముఖ్యమంత్రి జగన్ అన్నారు. బాపట్ల జిల్లా చుండూరు మండలం యడ్లపల్లిలో.. ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీని.. ఆయన ప్రారంభించారు. చదువు అనే ఆస్తితోనే.. పిల్లల తలరాతలు మారతాయన్నారు. అధికారం చేపట్టిన మూడన్నరేళ్లలో ఆ దిశగానే అడుగులు వేస్తున్నామని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- గుర్రాలపై వచ్చి కలెక్టర్ ఆఫీసు ముందు పెళ్లికాని ప్రసాదుల వింత నిరసన
మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో యువకులు వింత నిరసన చేశారు. వివాహం చేసుకోవటానికి రాష్ట్రంలో తగిన సంఖ్యలో అమ్మాయిలు పెళ్లికాని యువకులు కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. క్రాంతి జ్యోతి పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆందోళనకు పెళ్లికాని యువకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. గుర్రాలపై ఊరేగితూ సోలాపూర్ కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలో ప్రతి వెయ్యి మంది పురుషులకు సరిపడా మహిళల సంఖ్య లేదని యువకులు అంటున్నారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- దేశంలో కొత్త కరోనా వేరియంట్.. వాటికంటే డేంజర్.. చైనాలో ఇప్పటికే విధ్వంసం..
చైనాలో కరోనా కేసుల సునామీకి కారణమైన ఒమిక్రాన్ ఉపరకం కొత్త వేరియంట్ బీఎఫ్-7 దేశంలోనూ బయటపడింది. ఇప్పటివరకు 3 కేసులు నమోదుకాగా అందులో 2గుజరాత్‌లోనే బయటపడినట్లు ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి. ఈ వేరియంట్‌కు రీ-ఇన్‌ఫెక్షన్ కలిగించే సామర్థ్యం ఉండటం ఆందోళన కలిగిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రష్యా దండెత్తిన తర్వాత తొలి విదేశీ పర్యటన.. అమెరికాకు జెలెన్‌స్కీ.. వాటిపై చర్చ!
రష్యా దండెత్తిన తర్వాత తొలిసారి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అగ్రరాజ్యం అమెరికాకు బయల్దేరారు. ఈ పర్యటనలో ఆయన అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌తో వాషింగ్టన్‌లో భేటీ కానున్నారు. ఈ భేటీలో అమెరికా నుంచి వచ్చే ఆర్థిక, ఆయుధల సాయంపై ప్రధానంగా చర్చలు జరగనున్నట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- హ్యుందాయ్ నుంచి కొత్త ఈవీ.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 631 కి.మీ. వెళ్లేలా..
ప్రముఖ వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ తన ఎలక్ట్రిక్ వాహన శ్రేణిలో అయోనిక్5 ఎస్‌యూవీని విడుదల చేసింది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 631 కి.మీ. ప్రయాణించేలా దీన్ని రూపొందించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ప్రాక్టీస్‌లో రాహుల్‌కు గాయం.. రెండో టెస్టుకు అందుబాటులో ఉంటాడా?
టీమ్ ఇండియా తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ గాయపడ్డాడు. గురువారం జరగనున్న రెండో టెస్ట్ మ్యాచ్ కోసం ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో అతని చేతికి గాయమైనట్లు సమాచారం.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వామ్మో ఈ భామలు వేసుకున్న డ్రెస్ ఇంత కాస్ట్లీనా
సీనీ ముద్దుగుమ్మలు తమ అందంతోనే కాదు తమ డ్రెస్సింగ్ స్టైల్‌తోనూ అందరిని మెస్మరైజ్ చేస్తుంటారు. ఫ్యాన్స్ కోసం ఈ తారలు తమ లేటెస్ట్ అవుట్‌ఫిట్‌తో తీసుకున్న ఫొటోస్ను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తుంటారు. ఆలా రకుల్ ప్రీత్ సింగ్, తమన్నా వేసుకున్న డ్రెసులు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.