- నరసరావుపేటలో ఇబ్రహీం హత్య.. శాంతిభద్రతల దుస్థితికి నిదర్శనం:చంద్రబాబు
TDP ON NARASARAOPETA MURDER: మసీదు ఆస్తుల సంరక్షణ కోసం పోరాడుతున్న ముస్లిం నేతను అత్యంత కిరాతకంగా హతమార్చాడం జగన్ పాలనకు పరాకాష్ట అని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. ముగ్గురు ఉన్మాదులు పల్నాడును వల్లకాడు చేస్తున్నారంటూ మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- చదువు ఆనే ఆస్తితోనే.. విద్యార్థుల తలరాతలు మారుతాయి: సీఎం
TABS DISTRIBUTION IN AP : ప్రభుత్వ బడుల్లో డిజిటల్ విప్లవానికి శ్రీకారం చుట్టామని.. ముఖ్యమంత్రి జగన్ అన్నారు. బాపట్ల జిల్లా చుండూరు మండలం యడ్లపల్లిలో.. ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీని.. ఆయన ప్రారంభించారు. చదువు ఆనే ఆస్తితోనే.. పిల్లల తలరాతలు మారతాయన్నారు. అధికారం చేపట్టిన మూడన్నరేళ్లలో ఆ దిశగానే అడుగులు వేస్తున్నామని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 16వ నంబర్ జాతీయ రహదారి.. వరుసగా ఢీకొన్న ఎనిమిది వాహనాలు..
8 vehicles collided with each other: పొగ మంచు వాహనదారులకు ప్రాణసంకటంగా మారింది. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరం వద్ద 16వ నంబర్ జాతీయ రహదారిపై వరుసగా ఎమినిది వాహనాలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. మొదట ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొంది. లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో వెనుక వరుసగా ఉన్న ఆర్టీసీ బస్సులు లారీలు ఒకదానికొకటి గుద్దుకున్నాయి. స్థానిక పోలీసులు, హైవే పెట్రోలింగ్ సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మాచర్ల పోలీసులపై యరపతినేని ఫైర్..భవిష్యత్తులో ఉద్యోగాలు ఉండవు
Yarapatineni fire on Macharla police: మాచర్ల పోలీసులు టీడీపీ శ్రేణుల విషయంలో వ్యవహరిస్తున్న తీరుపై టీడీపీ సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావు తీవ్రంగా మండిపడ్డారు. తెలుగుదేశం నేతల్ని హింసించే పోలీసులెవ్వరికీ భవిష్యత్తులో ఇక ఉద్యోగాలుండవని హెచ్చరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'కొవిడ్ కథ ఇంకా ముగియలేదు.. బీ అలర్ట్'.. కేంద్రం సూచన
కొవిడ్ దశ ఇంకా ముగియలేదని, అందరూ అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య మంత్రి సూచించారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఉన్నతాధికారులతో దిల్లీలో సమీక్షా సమావేశం నిర్వహించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- దూసుకొచ్చిన మృత్యువు లైవ్ వీడియో
ఉత్తరాఖండ్ హల్ద్వానీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కలదుంగి పోలీసు స్టేషన్ పరిధిలోని పావల్‌ఘర్‌లో ఆటో, బైక్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న దీపాంశు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక సీట్లో కూర్చున్న అర్జున్ అనే వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు ఆటోను స్వాధీనం చేసుకుని, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఇమ్రాన్ ఖాన్ 'సెక్స్ కాల్ రికార్డింగ్'తో పాక్‌లో కలకలం.. ఫేక్ అంటున్న పీటీఐ
పాకిస్థాన్ మాజీ ప్రధాని, తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఓ మహిళతో ఆయన మాట్లాడినట్లు ఉన్న అసభ్య సంభాషణకు సంబంధించి.. లీకైన రెండు ఆడియో క్లిప్‌లు వైరల్‌గా మారాయి. అవి బయటకు వచ్చినప్పటి నుంచి పాకిస్థాన్‌లో దుమారం రేగుతోంది. ఈ వ్యవహారంపై స్పందించిన తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ ఆ ఆడియో క్లిప్‌లు నకిలీవని పేర్కొంది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- భారీగా పెరిగిన వెండి ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?
Gold Rate Today : దేశంలో బంగారం ధర స్వల్పంగా పెరగగా.. వెండి ధర భారీగా పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ప్రాక్టీస్ సెషన్లో కనిపించని కోహ్లీ.. అందరీ దృష్టి ఆ బంగ్లా ప్లేయర్‌పైనే..
బంగ్లాతో మొదటి పోరులో విజయం సాధించిన టీమ్ ఇండియా రెండో టెస్ట్ కోసం సిద్ధమవుతోంది. అయితే ఈ మ్యాచ్ మొదటి సెషన్‌కు భారత స్టార్ విరాట్ కోహ్లీ గైర్హాజరయ్యాడు. ఎందుకంటే పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'నేనొక నటుడ్ని.. అల్పసంతోషిని'... మనసును తాకేలా చిరు మాటలు
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వం వహించిన తాజా సినిమా 'రంగమార్తాండ'. ఇందులో రంగస్థల కళాకారుల గురించి వివరంచే ఓ షాయరీ ఉంది. దీనికి మెగాస్టార్ చిరంజీవి గళం అందించారు. అయితే తాజాగా దీనిని విడుదల చేశారు. ఇందులో చిరు మాట్లాడిన మాటలు మనసును తాకుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.