- తుపాను ప్రభావంతో నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలి: చంద్రబాబు
CBN LETTER TO CS: మాండౌస్ తుపాను బాధిత రైతులను ఆదుకోవాలంటూ.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు లేఖ రాశారు. భారీ వర్షాలతో లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని.. వరి, అపరాలు, అరటి, బొప్పాయి, పొగాకు, శనగ, మిరప, పత్తి పంటలకు తీవ్ర నష్టం జరిగిందని గుర్తు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- దిల్లీకి అమరావతి రైతులు.. మూడు రోజులు ఆందోళన
Amaravati farmers to Delhi: ఏకైక రాజధాని అమరావతి నినాదాన్ని ఎలుగెత్తి చాటేందుకు రాజధాని ప్రాంత రైతులు దిల్లీ పయనమయ్యారు. విజయవాడ నుంచి ప్రత్యేక రైలులో హస్తినకు బయల్దేరారు. మూడ్రోజుల పాటు దేశ రాజధానిలో వివిధ కార్యక్రమాలు చేపట్టనున్న రైతులు.. అమరావతి ఉద్యమానికి జాతీయస్థాయిలో మద్దతు కూడగట్టేలా ప్రణాళికలు రూపొందించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- నారా లోకేశ్‌తో.. కేజీఎఫ్ ఫేమ్ యశ్ భేటీ
KGF hero Yash met Nara Lokesh: ప్రముఖ సినీ నటుడు, కేజీఎఫ్ ఫేమ్ యశ్.. హైదరాబాద్‌లో తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను కలిశారు. దాదాపు అరగంట పాటు ఈ సమావేశం సాగింది. భేటీలో ఏ అంశాలు చర్చకొచ్చాయో ఇప్పటివరకు తెలియకపోయినా... వీరిద్దరూ కలవడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అంగన్‌వాడీ పిల్లలకు ఇచ్చే న్యూట్రిషన్ కిట్ నాణ్యతలో రాజీ వద్దు: సీఎం జగన్
CM JAGAN ON : అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. మహిళ, శిశు సంక్షేమ శాఖపై సమీక్ష చేసిన సీఎం.. సకాలంలో నాడు-నేడు పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని నిర్దేశించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- నీరవ్ మోదీకి లండన్ హైకోర్ట్ షాక్.. ఇప్పుడిక భారత్‌కే!
పరారీలో ఉన్న డైమండ్ వ్యాపారి నీరవ్‌మోదీకి లండన్ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత్‌లో నమోదైన కేసుల విచారణ నుంచి తప్పించుకునేందుకు నీరవ్‌కు ఉన్న అన్ని మార్గాలు దాదాపు మూసుకుపోయినట్లే కనిపిస్తోంది. భారత్‌కు అప్పగించేందుకు అనుమతి ఇస్తూ లండన్ హైకోర్టు వెలువరించిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసేందుకు.. నీరవ్‌మోదీకి న్యాయస్థానం అనుమతి నిరాకరించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మార్నింగ్ వాక్కు వెళ్లిన మహిళపై దుండగుడు కత్తితో దాడి.. గోల్డ్ చైన్‌ను లాక్కెళ్లేందుకు యత్నించి
పంజాబ్‌లోని లుథియానాలో మార్నింగ్ వాక్కు బయటకు వెళ్లిన మహిళపై ఓ దొంగ కత్తితో దాడికి పాల్పడ్డాడు. దీంతో మహిళ రోడ్డుపై పడిపోయింది. వెంటనే ఆమె మెడలోని బంగారపు గొలుసు, తన చేతిలో ఉన్న మొబైల్ ఫోన్‌ను లాక్కెళ్లేందుకు యత్నించాడు. అదే సమయంలో మహిళ కూడా ప్రతిఘటించడం వల్ల ఆమెకు చేతికి గాయాలయ్యాయి. స్థానికంగా ఉన్న సీసీటీవీలో మొత్తం ఘటనాదృశ్యాలు రికార్డు అయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- చైనాలో కరోనా మహమ్మారి విజృంభణ.. ఆస్పత్రుల వద్ద జనం బారులు!
చైనాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. అక్కడ భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. పలు చోట్ల ఆస్పత్రుల వెలుపల రోగులు క్యూకడుతున్న దృశ్యాలు బయటకొచ్చాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మరోసారి టెస్లా షేర్లను విక్రయించిన మస్క్.. కారణం చెప్పని కుబేరుడు
ట్విట్టర్ కొనుగోలుకు కావాల్సిన నిధుల్లో కొంత మొత్తాన్ని మస్క్ సొంతంగా సమకూర్చుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన భారీ ఎత్తున షేర్లను విక్రయిస్తున్నారు. తాజాగా మరోసారి 22 మిలియన్ల షేర్లు అమ్మేశారు. అయితే, దానికి కారణం మాత్రం మస్క్ వెల్లడించలేదు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- గణాంకాలను మించి చూడాలి.. కోహ్లీ విషయంలో అదే చేశా: ద్రవిడ్
బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ ఆడుతున్న కోహ్లీ.. మొదటి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో రాణించలేదు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ గతంలో ఫామ్ కోల్పోయినప్పుడు సమన్వయం ఎలా చేశాడో తాజాగా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ వెల్లడించాడు. ఏమన్నాడంటే? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆచార్య 'ధర్మస్థలి' సెట్లో ప్రభాస్- మారుతీ మూవీ షూటింగ్!
మెగస్టార్ చిరంజీవి నటించిన 'ఆచార్య' సినిమాలో ఉపయోగించిన ధర్మస్థలి సెట్‌ను ప్రభాస్ సినిమా కోసం వాడుతున్నట్లు తెలుస్తోంది. : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. పాన్ఇండియా సినిమాలుగా తెరకెక్కుతున్న 'ఆదిపురుష్', 'సలార్', 'ప్రాజెక్ట్ కే'లో నటిస్తున్నారు మన డార్లింగ్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.